ఒక్క ఘటన `బిగ్ బాస్` ఫేం నూతన్ నాయుడు జీవితాన్నే మార్చేసింది. పాపం నూతన్ నాయుడి ప్రమేయం లేకుండా జరిగిన ఘటనకు ఇప్పుడాయన బాద్యత వహించాల్సి వచ్చింది. భార్య చేసిన పనికి అతని భాగోతం మొత్తం బట్ట బయలవుతోంది. ఇటీవల ఓ దళిత యువకుడికి నూతన్ నాయుడు భార్య గుండు గీయించడం రాష్ర్ట వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఆ సమయంలో నూతన్ నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడు. కానీ భార్య చేసిన పనికి నూతన్ నాయుడు జీవితం మొత్తం తవ్వేసింది వెబ్ మీడియా. అతని పుట్టు పుర్తత్తరాల దగ్గర నుంచి ఎదిగిన వైనం..రాజకీయం జీవితం..బడా నేతలతో అతని పరిచయాలు అన్ని బమహిర్గమతయ్యాయి.
టీడీపీతో..వైసీసీతో..జనసేనతో…సమైక్యాంధ్రాతో అతని పరిచయాలు అన్ని బయటకొచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయంగా వైసీపీని ఎలా వాడాడు? జనసేనాని పేరుతో ఫాలోయింగ్ ఎలా సంపాదించాడు? ఇలా తవ్వేకొద్ది విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడిలా ఒక్క కేసుతో నూతన్ నాయుడు బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ…నూతన్ మాత్రం తమ పేరును…పరపతిని ఓ రేంజ్ లో వాడేసుకున్నాడంటూ మండిపడుతున్నారు. ఏపీ సీఎంవో కార్యదర్శి పేఇలాతో భార్యను విడిపించుకోవడం కోసం ఫోన్ కాల్ చేయగా తాజాగా, సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మాణ వ్యవహారాలు చూసే వెంకట్ శిద్ధారెడ్డి పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.
పీఎంవో పీవి రమేష్ పేరు చెప్పుకుని బయట తన పనులు ఎలా చేసుకున్నారో కూడా పోలీసులు నిగ్గు తేల్చారు. అటు విశాఖలో పలు పోలీస్టేషన్లలో అతనిపై కేసులు నమోదవ్వడం చూస్తుంటే…నూతన్ బాధితులు ఇంకెంత మంది ఉన్నారో? అనిపించక మానదు. ఆ విషయాలు ఎలా ఉన్నా నూతన్ నాయుడు బిగ్ బాస్ ద్వారా సంపాదించిన పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా గంగపాలయ్యాయి. నూతన్ నాయుడి గురించి సోషల్ మీడియాలో నెటి జనులు తీవ్ర విమర్శలతో విరుచుకు పడుతున్నారు.