హైదరాబాద్ ఛత్రినాకలో దారుణం జరిగింది. ఛత్రినాకకు చెందిన మహిళ ఇంటి ఎదురుగా పదో తరగతి చదువుతున్న బాలుని కుటుంబం నివసిస్తోంది. ఇతని వయస్సు 17 సంవత్సరాలు. ఎదురెదురు ఇండ్లు కావడంతో వారు కలిసి మెలిసి ఉండేవారు. బాలుడు అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చే వాడు.
నెలరోజుల క్రితం మహిళ స్నానం చేస్తుండగా ఆ బాలుడు వారింట్లోకి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాత్రూం కిటికి నుంచి సెల్ ఫోన్ లో మహిళ స్నానం చేసే దృశ్యాన్ని రికార్డు చేశాడు. ఆ తర్వాత వాటిని వారి ప్రెండ్స్ ఫోన్లకు పంపాడు. ఈ విషయం ఆ మహిళ వారం కింద తెలుసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడి పదో తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకొని సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరిపారు. కానీ అవి కుదర్లేదు. ఇప్పటికే సైబర్ క్రైం కి చెప్పి వీడియోను తొలగించమని చెప్పామని కూడా తెలిపారు. కానీ ఆ మహిళ వినలేదు.
పోలీసుల తీరును నిరసిస్తూ సోమవారం పోలీస్ స్టేషన్ ముందు గ్యాస్ నూనె పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆమెని నిలువరించారు. బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోం తరలించారు.