అంతా తానై ….కథ నడిపించిన జూనియర్ యన్టీర్

నందమూరి హరికృష్ణ చనిపోయిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి , తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు అన్నీ తానే  అయి ఏర్పాట్లు చేసినట్టు చెప్పుకున్నారు . చంద్ర బాబు అనుకూల మీడియా కూడా అదేవిధమైన  ప్రచారం చేసింది . చూసేవారికి కూడా చంద్ర బాబు, లోకేష్ బాబు ఎంతో కష్టపడినట్టు కలర్ వచ్చేసింది . 

కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీ రామారావు పుట్టెడు దుఃఖంలో వున్నారు కాబట్టి చంద్ర బాబు అన్నీ చూశాడు కాబోలు అనుకున్నారు .నిజానికి అన్ని ఏర్పాట్లు జూనియర్ ఎన్టీర్  కనుసన్నల్లో జరిగాయట. .తారక రామారావు అంత విషాదంలో కూడా తన బాధ్యత  మర్చిపోలేదట . తన మనుషులను ఇద్దరినీ ఈ పనుల కోసం వినియోగించాడట . ప్రతి చిన్న విషయం కూడా తారక రామారావుకు తెలియకుండా జరగలేదని  అంటున్నారు .

హరికృష్ణకు తారక రామారావు అంటే ఎంతో ఇష్టం . అలాగే తారక్ కు కూడా హరికృష్ణ అంటే ప్రాణం . తెలుగుదేశం పార్టీ తన తాత పెట్టిన పార్టీ , ఆ పార్టీ కోసం తన తండ్రి ఎంతో కష్ట పడ్డాడు . కానీ ఆయనకు పార్టీలో గౌరవం లేకుండా పోయిందనే కోపం జూనియర్ లో వుంది .దీనికి తోడు బాబాయ్ బాలకృష్ణ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు . ఎన్టీఅర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి కూడా తారక రామారావుకు ఆహ్వానం లేదు . అటు మావయ్య చంద్ర బాబు నాయుడు అన్నా , ఇటు బాబాయ్ బాలకృష్ణ అన్నా తారక రామారావు మండిపడేవాడు .

తండ్రి చనిపోయిన తరువాత వారి రాజకీయ ప్రయోజనం కోసం ఎల్లా ప్రవర్తిస్తున్నారో తారక రామారావుకు అర్ధమైంది .అందుకే లోపల కోపం ఎంత వున్నా దాన్ని కనపడనీయకుండా తన తండ్రి అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు అన్నీ తానె చేయించాడట. నిర్మాత గుణ్ణం గంగరాజు కుమారుడు, మరో నిర్మాత భోగవల్లి ప్రసాద్ కుమారుడు, తారక రామారావు చెప్పిన పనులన్నీ చకచకా చేశారట . మహానటుడు ఎన్టీ రామారావు మనవడు అయిన జూనియర్  తారక రామారావు ని తక్కువగా అంచనా వెయ్యలేం . ఆయన చాలా స్పష్టంగానే వున్నాడు .