“ఈనాడు” పత్రిక అంటే ఒకప్పుడు సమాజంలో చాలా విలువ ఉండేది కానీ.. ఇప్పుడు క్రెడిబిలిటీలో దాని గ్రాఫ్ రోజు రోజుకీ పడిపోయి.. ఆల్ మోస్ట్ పతనావస్తకి వచ్చింది అని పలువురు “ఈనాడు” అభిమాన పాఠకులు చెబుతున్న మాట! ఒకప్పుడు “ఈనాడు” లో వచ్చిందే నిజం.. రామోజీ చెప్పిందే వాస్తవం అన్న కాలం నుంచి.. “ఈనాడు”లో వచ్చిందంటే… మరోపత్రికలో కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అందుకు ఒక తాజా ఉదాహరణ సాక్ష్యాలతో సహా బయటపడటం.. అందుకు ఈనాడు యాజమాన్య తన తప్పును సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా.. చింతిస్తున్నామంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే… టీడీపీ నేత పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ… ఆయన శరీరంపై దెబ్బలు చూపుతున్నట్టు ఫోటోలను “ఈనాడు” ప్రచురించింది. తీరా చూస్తే, అవి 2021 నాటివని పాఠకులు పసిగట్టారు. దాంతో “ఈనాడు” పత్రిక అత్యుత్సాహాన్ని నెటిజన్లు ఎండగట్టారు. సెటైరికల్ కామెంట్లతో సోషల్ మీడియాను వేడెక్కించేశారు. ఫలితంగా.. పట్టాభి విషయంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో భాగంగా ఈనాడు పత్రిక కాస్త అత్యుత్సాహం ప్రదర్శించిందనే విషయం స్పష్టమైంది!
దీంతో… మరో ఆప్షన్ లేని ఈనాడు.. పట్టాభిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ప్రచురించిన ఫొటోల్లో పొరపాటు జరిగినట్టు ఈనాడు యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. ఈ తప్పు సాంకేతిక కారణాల వల్ల జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఫలితంగా… ఈనాడు కి ఎలాంటి పరిస్థితి వచ్చింది.. మరీ దారుణంగా సాక్ష్యాలతో సహా దొరికిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.