ఎన్నికల ముందు ప్రతి పార్టీ తాము అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలు ఇవేనంటూ కొన్ని హామీలను ప్రకటించడం జరుగుతుంది. అయితే ఆ హామీలను నెరవేర్చిన సీఎంలు చాలా తక్కువమంది అనే సంగతి తెలిసిందే. అయితే ఇచ్చిన మేనిఫెస్టోలను అమలు చేసిన సీఎంలలో ఎన్టీఆర్ వైఎస్సార్ తర్వాత జగన్ మాత్రమే ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ స్థాయిలో ఈ మధ్య కాలంలో లేరనే చెప్పాలి.
జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో దాదాపుగా 95 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చారు. చంద్రబాబు నాయుడుతో పోల్చి చూస్తే ఈ విషయంలో జగన్ చాలా గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కొత్త హామీలను అయితే ప్రకటించబోరని కానీ ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజలు సైతం జగన్ పాలనతో సంతృప్తితో ఉన్నారు.
అయితే ఎవరికీ ఇబ్బందులు కలగకుండా జగన్ పాలన సాగించాలని కొంతమంది సూచనలు చేస్తుండటం గమనార్హం. జగన్ పై కొంతమందిలో వ్యతిరేకత ఉండటం వాస్తవమేనని అయితే ఎన్నికల సమయానికి ఆ వ్యతిరేకతను పూర్తిస్థాయిలో తగ్గించే దిశగానే జగన్ అడుగులు ఉండనున్నాయని సోషల్ మీడియాలో జోరుగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ అభివృద్ధి విషయంలో తీసుకునే నిర్ణయాలే ఆయన పొలిటికల్ కెరీర్ ను డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మద్యపాన ప్రియుల్లో జగన్ పై కొంతమేర వ్యతిరేకత ఉండగా సీఎం జగన్ మద్యం రేట్లను తగ్గించాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు. ఇతర పార్టీల విషయంలో జగన్ మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారు