మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి మాకవరపాలెం వరకు రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ప్రకటించారు. భద్రతా కారణాలు, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
జాతీయ రహదారిపై కాన్వాయ్‌కు నిరాకరణ మాకవరపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి ఈ నెల 9వ తేదీన జగన్ రానున్నారు. ఇందుకోసం వైసీపీ శ్రేణులు మాజీ సీఎం జగన్‌కు విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలో మీటర్ల జాతీయ రహదారిపై కాన్వాయ్‌తో రావడానికి అనుమతులు కోరారు.
జాతీయ రహదారి రోడ్డు మార్గంలో కూడళ్ల వద్ద జన సమీకరణ చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం అందిందని ఎస్పీ తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు మరియు ప్రజలకు అసౌకర్యం కలుగుతాయని, అందుకే రోడ్డు మార్గంలో పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
ఆటో డ్రైవర్లను చంద్రబాబు ఘోరంగా మోసం చేశారు: షర్మిల ధ్వజం
పశువులకు కూడా హాస్టల్ సౌకర్యం: ఏపీలో మూగజీవాల సంరక్షణకు చంద్రబాబు వినూత్న ప్రణాళిక
తమిళనాడులో ఇటీవల విజయ్ నిర్వహించిన రోడ్ షోలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడిన దురదృష్టకర సంఘటనను ఎస్పీ గుర్తు చేశారు. అలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే 63 కిలోమీటర్ల మేర కాన్వాయ్‌తో ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరించారు.
ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్‌పై వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో వచ్చేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు.
ఈరోజు (మంగళవారం) అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు.

