స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సీఎం జగన్ కొత్త ఆలోచన..

స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సీఎం జగన్ కొత్త ఆలోచన..

అధికారంలోకి వచ్చినప్పటినుండి తన పాలనలో వైవిధ్యాన్ని కనపరుస్తున సీఎం జగన్, తాజాగా మరో మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర రాజధాని అమరావతిలో స్వాతంత్ర వేడుకలను జరపాలి. కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే, స్వాతంత్ర వేడుకలను రాష్ట్ర రాజధానిలో జరిపి..అభివృద్ధి ఒకే ప్రదేశంలో కేంద్రీకృతమైనట్లు చూపించడం ముఖ్యమంత్రికి ఇష్టంలేదని, ప్రతి సంవత్సరం వేదిక మార్చడం ద్వారా రాష్ట్రంలోని ప్రదేశాలన్నీ సమానమేనన్న విషయాన్నీ చాటిచెప్పాలనుకుంటున్నారని సెక్రెటేరియట్లోని వర్గాలు తెలిపాయి.

సీఎం జగన్ నూతన ఆలోచన అందర్నీ మెప్పించినప్పటికీ, అభివృద్హిలో కూడా తగిన ప్రాముఖ్యత కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

కాగ, అమరావతి క్రెడిట్ చంద్రబాబుకు ఉన్నందున…బాబు కలగన్న సింగపూర్ లో ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్వాతంత్ర వేడుక జరుపుకోవడం ఇష్టపడక సీఎం జగన్ వేదిక మార్చారని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.

కాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన స్వాతంత్ర వేడుకలకు అనువుగా ఉండే ప్రదేశముకొరకు వైజాగ్ లో అన్వేషణ జరుగుతున్నట్లు సమాచారం.