నిమ్మగడ్డ పులిలా గర్జిస్తున్నాడు – ఒక్కసారిగా 30 మందిని పీకి అవతల పారేశాడు ?

The High Court erred in the orders issued by Nimmagadda Ramesh Kumar
పంచాయతీ ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రభుత్వం, ఎన్నికల కమీషనర్ నడుమ వేడి కూడ పెరుగుతోంది.  ఒకరి మీద ఒకరు పంతం సాధించడానికి దొరికే  చిన్న అవకాశాన్ని కూడ వదులుకోవట్లేదు ఇరు పక్షాలు.  సుప్రీం కోర్టు ఆదేశాలతో కొండంత బలం పుంజుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిస్థాయి అధికారాలు ప్రయోగిస్తూ అడ్డంకులు అనుకున్న అన్నింటినీ తొలగించుకుని ముందుకుపోతున్నారు.  చిత్తూరు కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, గుంటూరు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్ ‌కుమార్‌లను బదిలీ చేశారు.  తిరుపతి అర్బన్ ఎస్పీని కూడ బదిలీ చేశారు.   పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ ను బదిలీ చేసినట్లే చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.  తర్వాత వారిపై అభిశంసన ప్రక్రియ చేపట్టే ప్రయత్నం చేశారు. 
Nimmagadda Ramesh Kumar another shock to YSRCP
Nimmagadda Ramesh Kumar another shock to YSRCP
ఇలా తన నిర్ణయాలతో ఎప్పుడు ఎవరి మీద పడతారో అన్నట్టుగా ఉన్న నిమ్మగడ్డ తాజాగా మరొక బాంబు పేల్చారు.  ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు లింక్ పెట్టారు.  గత ఏడాది మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా భారీగా ఏకగ్రీవాలు జరిగాయి.  వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలో ఊహించని స్థాయిలో ఏకగ్రీవాలు జరిగాయి.  అయితే ఆ ఏకగ్రీవాల వెనుక బెదిరింపులు, దాడులు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు.  ఒకానొక దశలో ఆ ఏకగ్రీవాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు కూడ.  ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఏకగ్రీవమైన మండలాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.  ఒక్క చిత్తూరు జిల్లాలోనే  ఏకంగా 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలని నిమ్మగడ్డ  ఆదేశించారు.  
 
ఏకగ్రీవాలు జరిగిన చోట పాత అధికారులే రిటర్నింగ్ అధికారులుగా ఉంటే కుట్రలు జరగవచ్చం ఉద్దేశ్యంతో ఈసీ ఈ డెసిషన్ తీసుకున్నారు.  అయితే ఈ నిర్ణయం చిత్తూరు జిల్లా మీదే కావడం విశేషంగా మారింది.  ఎందుకంటే తిరుపతి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా.  అక్కడ ఆయన చెప్పిందే వేదం.  జగన్ సైతం జిల్లాను పూర్తిగా ఆయనకే వదిలేశారు.  పాలన, ఎన్నికలు, బదిలీలు, పార్టీ వ్యవహారాలు ఏదైనా సరే పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరగాల్సి ఉంటుంది.  అలాంటి జిల్లా మీద నిమ్మగడ్డ పట్టుబిగించారు.  ఇది ఒకరకంగా అధికార పార్టీకి గిట్టని విషయమే.  మరి ఈసీ ఆదేశాలను సీఎస్ పాటిస్తారా లేకపోతే ఏవైనా అభ్యంతరాలు తెలుపుతారా అనేది చూడాలి.  
 
 
 
Keywords: Andhrapradesh, Elections Commissioner, Tirupathi, Peddireddy Ramachandrareddy, YSRCP, YS Jagan, Nimmagadda Ramesh Kumar, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ, వైఎస్ జగన్, తిరుపతి, పంచాయతీ ఎన్నికలు