వైసీపీ ప్రభుత్వానికి పెను సవాల్ గా మారిన నూతన ఏడాది వార్షిక బడ్జెట్!

New Year's annual budget has become a big challenge for the YCP government!

ఆంధ్ర ప్రదేశ్:ప్రస్తుత సంవత్సరం ముగింపుకి రావటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పుడు అతి పెద్ద సవాల్ వేచి ఉంది.వస్తున్నా కొత్త ఏడాదిలో కొత్త వార్షిక బడ్జెట్ ని తయారు చేసి ప్రజల ముందు పెట్టాలి. కానీ బడ్జెట్‌ ని సిద్ధం చేయటానికి నిధుల లేమి పెద్ద తలనోప్పిగా ఉందట. అరకొర ఉన్న నిధులను ఎలా వినియోగించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారట. ఉన్న నిధులను రెవెన్యూ రంగానికే కేటాయిరచాల్సి ఉరటురదని, అరదువల్ల సంపద సృష్టి విభాగానికి సమస్యలు తప్పకపోవచ్చునని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

New Year's annual budget has become a big challenge for the YCP government!
New Year’s annual budget has become a big challenge for the YCP government!

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు, వాస్తవ ఆదాయ వ్యయాలకు పొరతన లేకుండాపోయింది. రూ.2.28 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టినా, అందుకు అనుగుణంగా ఆదాయం రాకపోవడమే కాకుండా, రెట్టింపు వ్యయం పెరిగిపోయిందని అధికారులు అరటున్నారు. ఈ కారణంగా సంపద సృష్టి లేకపోవడం ఆరదోళన కకలుగిస్తోందని కూడా వారు వాపోతున్నారు.

ఇవేమి ఇబ్బంది కానట్లుగా ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి సంక్షేమానికే పెద్దపీట వేయాలని తేల్చిచెప్పడంతో ఇతర రంగాలకు నిధులు సమకూర్చలేకపోతున్నామని ఆర్ధికశాఖకు సంబంధించిన అధికారి నుండి అందిన సమాచారం. మొత్తం బడ్జెట్‌లో అధిక భాగం నిధులను సంక్షేమ రంగాలకు కేటాయిరచే దిశగా కసరత్తు చేస్తున్నామని, ముఖ్యమంత్రి కూడా నవరత్నాలకు నిధుల లేమి లేకుండా బడ్జెట్‌లో చూడాలని నిర్దేశించారని ఆయన వెల్లడిరచారు.

New Year's annual budget has become a big challenge for the YCP government!
New Year’s annual budget has become a big challenge for the YCP government!

ఈ నేపథ్యంలోనే 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించేందుకు ఆర్థికశాఖ సన్నాహాలు చేస్తుంది. ముందుగా పలు శాఖల అధికారుల నుండి ప్రతిపాదనలు స్వీకరించి ఆర్ధికశాఖ అధికారులు చర్చించనున్నారు.ఆ తరువాత ఆయా శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి స్వయంగా భేటీ కానున్నారు. ఈ కసరత్తు పూర్తయ్యాక ముఖ్యమంత్రితో చర్చించి తుది బడ్జెట్‌ను ఖరారు చేస్తామని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.