గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న గోరంట్ల మాధవ్ కేసు విషయంలో ఎట్టకేలకు ఎండ్ కార్డ్ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మాధవ్ మొబైల్ లేదా అవతలి వ్యక్తి మొబైల్ దొరకాలని ఏదో ఒక మొబైల్ దొరికేవరకు వైరల్ అయిన వీడియో ఒరిజినల్ వీడియోనా కాదా అనే విషయాన్ని చెప్పడం సులువు కాదని వెల్లడించారు. అయితే గోరంట్ల మాధవ్ తన వీడియోను మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు.
అందువల్ల ఆయన మొబైల్ పోలీసుల చేతికి చిక్కినా ఆయన రికార్డ్ చేసి ఉండరు కాబట్టి వైరల్ అయిన వీడియో గురించి తెలిసే ఛాన్స్ లేదు. గోరంట్ల మాధవ్ తో వీడియో కాల్ మాట్లాడిన మహిళ ఎవరనే ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. భవిష్యత్తులో కూడా సమాధానం దొరుకుతుందని ఎవరూ భావించడం లేదు. టీడీపీ నేతలు మాత్రం ఈ కేసు విషయంలో మరికొన్ని రోజులు గోల చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
అయితే టీడీపీ నేతలు ఇప్పటికే ఈ వివాదం ద్వారా పరువు తీసుకున్నారు. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తే పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు. ఈ ఎపిసోడ్ కు శుభం కార్డు పడినట్టేనని ఇందుకు సంబంధించిన వివాదాన్ని పెద్దది చేసినా పెద్దగా లాభం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గోరంట్ల మాధవ్ కూడా ఈ వివాదం గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడటం లేదు.
అయితే ప్రజల్లో చాలామంది మాత్రం వైరల్ అయిన గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ అని భావిస్తుండటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ వైసీపీ నుంచి పోటీ చేసినా ఆయన గెలవడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోరంట్ల మాధవ్ విషయంలో వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. గోరంట్ల మాధవ్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో జగన్ ఆయన విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.