బ్రేకింగ్ న్యూస్ : జగన్ మీద దాడి కేసులో ఊహించని ట్విస్ట్

విశాఖ ఎయిర్ పోర్టులో వైసిపి అధినేత జగన్ మీద దాడి కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది?  ఈ దాడి చేసిన వ్యక్తికి జగన్ మీద కోసం ఉందా? జగన్ అంటే పగ ఉందా? అతడిని దాడి చేయాలంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరైనా పురమాయించారా? అసలు ఈ క్యాంటీన్ లో పనిచేసే వెయిటర్ కు జగన్ మీద కసి ఎందుకు? ఇలాంటి అనేక అనుమానాలు రేకెత్తున్న దశలో అసలు జగన్ మీద దాడి చేసిన వ్యక్తి ఆయనకు వీరాభిమానే అనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ దాడి విషయంలో అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. ఈ దాడి చేసిన వ్యక్తి నేర చరిత ఉన్న క్రిమినల్ అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. పట్టుమని పాతికేళ్లు కూడా లేని యువకుడు ఎందుకు అంత కసిగా జగన్ రక్తం కళ్ల చూశాడు. జగన్ మీద దాడి చేసిన ఆ వ్యక్తి పేరు శ్రీనివాస రావు. అతడిది తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం మండలంలోని దనియపల్లి గ్రామానికి చెందిన వాడు. అటువంటి బచ్చాగాడు జగన్ మీద దాడి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

జగన్ తో కలిసి తన ఫొటో తో ఫ్లెక్సీ వేయించిన శ్రీనివాస రావు

నిజానికి శ్రీనివాస రావు జగన్ కు వీరాభిమాని. ఎంతగా అభిమాని అంటే జగన్ ఫొటో, తన ఫొటో కలిపి ఫ్లెక్సీ చేయించి మరీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి దాడి వెనుక ఏ రకమైన శక్తులు పని చేేసి ఉంటాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. విశాఖ ఎయిర్ పోర్టులో వెయిటర్ గా పనిచేస్తున్న అతడు జగన్ వద్దకు నవ్వుతూ వచ్చి సెల్ఫీ దిగుతానంటూ రిక్వెస్ట్ చేశాడు. తర్వాత వెంటనే తన చేతిలో ఉన్న ఆయుధంతో జగన్ భుజం మీద బలంగా గూచ్చి దాడికి దిగాడు. 

జగన్ మీద అంతటి అభిమానం ఉన్న వ్యక్తి ఎందుకు దాడి చేశాడనేది మాత్రం వెలుగులోకి రావడంలేదు. పైగా నవ్వుకూంటు రావడం, సెల్ఫీ దిగే ప్రయత్నం చేయడం, తర్వాత దాడి చేయడం ఇవన్నీ వైసిపి నేతలకే కాకుండా పోలీసులకు కూడా అంతుచిక్కని ప్రశ్నలే. అతడేమీ క్రిమినల్ అనడానికి కారణాలు లేవు. వయసు కూడా చాలా చిన్నదే. మరి ఎందుకు దాడి చేశాడన్నది తేలాల్సి ఉంది.

అయితే అంత చిన్న బచ్చాగాడే దాడి చేసినా ఈ దాడిని ఆశామాషీగా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ దాడి చేసింది సాధారణ వ్యక్తి కాదు కేబినెట్ ర్యాంక్ సెక్యూరిటీ ఉన్న ఆంధ్రా ప్రతిపక్ష నేత. మరి దాడి కూడా సిల్లీగా జరిగిందనడానికి లేదు. ఆ యవకుడు వాడిన ఆయుధం మామూలుది కాదు. కోళ్ల పందాల్లో ప్రత్యర్థి కోడిపుంజును చంపేందుకు కోడి కాలుకు కట్టే కత్తి అది. మరి దానితో దాడి చేయడమంటే ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందేమో అన్న అనుమానలైతే బలంగా రేగుతున్నాయి.

దాంతోపాటు దాడి చేసిన వెంటనే నిందితుడి వ్యవహార శైలి కూడా వివాదాస్పదమైతున్నది. దాడి చేసి జగన్ నెత్తురు కండ్ల చూసిన శ్రీనివాస్ వెంటనే తనను అరెస్టు చేయండి.. అరెస్టు చేయండి అంటూ అరవడం కొత్త అనుమానాలకు తావిస్తున్నది. అసలు ఆ కోడిపందేల్లో వాడే కత్తి ఎయిర్ పోర్టుకు ఎలా వచ్చింది? దానితోనే జగన్ మీద దాడి చేయాలని ఆ అబ్బాయి ఎందుకు అనుకున్నాడు. పైగా నవ్వుతూ నమ్మించి దాడి ఎందుకు చేశాడు? ఈ అన్ని అంశాలపై సమగ్రమైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి.

జగన్ కు సానుభూతి వస్తదని దాడి చేశా : శ్రీనివాస్ రావు

జగన్ మీద దాడి చేసిన శ్రీనివాస రావు ప్రాథమిక విచారణలో కొన్ని అంశాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. జగన్ 2014లో ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకున్నానని, అయినా ఓడిపోయాడని ఆయన పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. జగన్ ఈసారైనా సిఎం కావాలన్న ఉద్దేశంతోనే కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. దాడి చేస్తే సానుభూతి వస్తదని భావించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే  ఈ వివరాలు నిజమేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది. 

ఈ దాడిపై వైసిపి నేతల ఆగ్రహ జ్వాలలు కానీ, టిడిపి నేతల వెకిలి విమర్శలను కానీ పట్టించుకోకుండా ఎపి పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. ఆయుధం ఉత్తుత్తి ఆయుధమే భోజనం చేసే పోర్క్ తో దాడి అని మరీ చిన్న ఇష్యూగా చేసి చూపడం సరికాదు. ప్లాన్ ప్రకారం జరిగిందా? అనూహ్యంగా జరిగిందా అన్నది పక్కన పెడితే ఈ దాడి మాత్రం పోలీసు వ్యవస్థకు సవాల్ లాంటిదే అని చెప్పవచ్చు.