మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు, టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ ఈ రోజు విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనను కండువా కప్పి పార్టీలోకి విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. అయితే, ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరు కాకపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతోన్న సీఎం వైఎస్ జగన్ పాలన చూసే చాలా మంది వైసీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాసరావు తమకు కొన్ని ప్రతిపాదనలు పంపారని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ఆమోదం తర్వాత గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా, వైసీపీలో గంటా శ్రీనివాసరావు చేరతారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. జీవీఎంసీ ఎన్నికల వేళ గంటా ప్రధాన అనుచరుడు వైసీపీలో చేరడం చర్చనీయాంశమైంది.
అయితే ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నారు. ఆయనను చేర్చుకోవడం అవంతికి ఇష్టం లేదంటున్నారు.. మరి త్వరలో గంటా కూడా వైసీపీలో చేరితే అవంతి పరిస్థిఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం విశాఖలో ఈ పరిణామాలతో రాజీకీయం వేడెక్కింది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే నగరంలో బలమైన నేత అయిన గంటాను.. వైసీపీిలోకి చేర్చుకోడానికి ఇదే సరైన సమయం అని వైసీపీ భావించినట్టు తెలుస్తోంది