వైఎస్ జగన్ కు కొత్త కష్టాలు.. అప్పులు పుడితేనే ఏపీలో పథకాలు అమలవుతాయా?

1600x960_972875-jagan-mohan-reddy

ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీకి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు ఎక్కువేననే సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలు అమలు కాగా ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అప్పులు పుడితేనే ఏపీలో పథకాలు అమలవుతాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

డబ్బులు లేకపోవడం వల్ల జగన్ సర్కార్ పలు స్కీమ్స్ ను వాయిదా వేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగనన్న విద్యా దీవెన స్కీమ్ అమలు ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ ఆసరా స్కీమ్ కోసం డ్వాక్రా మహిళలు ఎదురుచూస్తుండగా ఈ స్కీమ్ అమలు ఎప్పుడు జరుగుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి ప్రశ్నార్థకం అయింది.

ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సరైన సమయంలో జమ కావడం లేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సరైన సమయంలో పథకాలను అమలు చేయకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

జగన్ సర్కార్ పథకాల అమలు విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సి ఉంది. చెప్పిన తేదీకి పథకాలను అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో మరింత మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. జగన్ సర్కార్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అయినా ఈ తరహా తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతుందేమో చూడాల్సి ఉంది.