జనసేనకు ఆ మీడియా సపోర్ట్ కూడా పోయిందా.. అయ్యో పాపం అంటూ?

Pawan-kalyan-1

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పాలన అందించాలని అనుకున్నారు. అయితే జనసేనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మినహా ఆ పార్టీలో కీలక నేతలు లేరు. పవన్ జనసేన పార్టీకి మీడియా సపోర్ట్ కూడా లేదు. ఇంతకాలం జనసేన పార్టీకి 99 టీవీ నుంచి సపోర్ట్ లభించింది. అయితే ఇకపై ఆ ఛానల్ సపోర్ట్ కూడా ఉండదు.

జనసేన పార్టీకి అనుకూలంగా కథనాలను ప్రచారం చేసే 99 టీవీపై జనసేన అభిమానుల్లో కూడా పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. అయితే ఆ ఛానల్ అధినేత తోట చంద్రశేఖర్ పార్టీ మారడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇప్పటికే ఆ ఛానల్ లో బీఆర్ఎస్ గురించి పాజిటివ్ గా కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. పవన్ కంటే కేసీఆర్ సపోర్ట్ ఉండటం వల్ల తనకు బెనిఫిట్ కలుగుతుందని తోట చంద్రశేఖర్ భావిస్తున్నారు.

ఇప్పటికే పలు ఎన్నికలలో పోటీ చేసిన తోట చంద్రశేఖర్ కు చేదు ఫలితాలే ఎదురయ్యాయి. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపించినా చూపించకపోయినా కొంతకాలం పాటు తోట చంద్రశేఖర్ హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జనసేనకు మీడియా సపోర్ట్ పోవడంతో పవన్ ఏం చేస్తారో చూడాలి.

పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా ఒక టీవీ ఛానల్ ను ప్రారంభిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా పవన్ ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధినేతలకు టీవీ ఛానల్ సపోర్ట్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. చంద్రబాబు, జగన్, కేసీఆర్ లకు పలు పత్రికలు, టీవీ ఛానెళ్ల సపోర్ట్ ఉండటం ఆయా రాజకీయ నేతలకు ప్లస్ అవుతోంది.