ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి . ఏపీలో ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను ఏపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం విషయంలో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు విషయంలో జరుగుతున్న జాప్యం గురించి కూడా హైకోర్టు సీరియస్ అయింది.
ఏపీ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు చిన్నచిన్న సమస్యలలా కనిపిస్తున్నా ఆ సమస్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందిపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుమోటోగా కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం తమకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని తరచూ ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
నిధుల లేమి వల్లే ఈ సమస్యలు అని జగన్ సర్కార్ భావిస్తే ఒకటీ రెండు పథకాలను ఆపేసి ప్రభుత్వం ముందడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. ప్రజల దృష్టిలో చులకన అయ్యే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదనే భావన చాలామందిలో ఉంది. కోర్టులలో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పుల వల్ల ప్రభుత్వం పరువు పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి పట్టించుకునే విషయంలో జగన్ సర్కార్ తడబడుతోంది. రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ కు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చూడాల్సి ఉంది.