హే భగవాన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ స్థలాలకు కూడా పన్నులు కట్టాలా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన రాజధాని లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గుతోంది. అయితే ఆదాయం తగ్గిన స్థాయిలో ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే బస్ టికెట్ రేట్లు, ఇంటి పన్నులు, కరెంట్ ఛార్జీలు పెంచిన ఏపీ ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఖాళీ స్థలాలకు సైతం పన్నులు విధిస్తోందని బోగట్టా.

అయితే ఖాళీ స్థలాలకు పన్నులు చెల్లించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ మాత్రం ఆదాయం లేని స్థలాలపై పన్నులు చెల్లించాల్సి వస్తే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏంటని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని మరి కొందరు చెబుతున్నారు.

ప్రజల నుంచి విమర్శలు వచ్చే నిర్ణయాలపై జగన్ సర్కార్ కు ఆసక్తి ఎందుకని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలాలకు కూడా పన్నులు కట్టాలంటే ప్రభుత్వ పథకాలు పొందుతున్న ప్రజల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది. జగన్ సర్కార్ ఏ నిర్ణయాన్ని అమలు చేసినా మొదట ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆర్థికంగా ప్రయోజనం చేకూరడం కోసం జగన్ సర్కార్ కొన్ని సందర్భాల్లో విమర్శలను పట్టించుకోకుండా ముందడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే పరిస్థితులు నెలకొనగా ఈ పరిస్థితులను జగన్ సర్కార్ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.