పవన్ కు కొత్త శత్రువులు.. ఈ మాజీ జనసైనికులు!

సినిమాల్లో సూపర్ స్టార్ గా ఉన్న పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో మాత్రం కమెడియన్ పాత్ర పోషిస్తున్నారని విమర్శలు చేస్తుంటారు విశ్లేషకులు! బేసిక్స్ తెలియకుండా పాలిటిక్స్ చేయడం తనకే కాదు, తనను నమ్ముకున్నవారికి సైతం తీవ్ర అన్యాయం చేస్తుందని చెబుతుంటారు. ఇక వైకాపానేతలైతే… జనసేన అనేది పార్టీ కాదని, చంద్రబాబుకు అద్దెకిచ్చే టెంట్ హౌస్ అని కామెంట్స్ చేస్తుంటారు. అయితే పవన్ పై విమర్శలు చేసేవారిలో కొత్తగా “మాజీ జనసైనికులు” కూడా తోడయ్యారు. వారు సైతం పవన్ ఉన్న ఆగ్రహాన్ని ఆన్ లైన్ వేదికగా నిర్భయంగా, ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తపరుస్తున్నారు.

పవన్ పై విమర్శలు చేసే వారి లిస్ట్ పెద్దగానే ఉంటుంది. అయితే ఈ విషయంలో మీడియా ముందు పేర్ని నాని, ఆన్ లైన్ లో ఆర్జీవీ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నారు! పవన్ పై విమర్శలు చేయడంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీ పడుతుంటారు! ఈ సందర్భంగా వారాహి వాహనంపై తాజాగా మరోసారి స్పందించారు. వీరికి మాజీ జనసైనికులు తోడయ్యారు.

వారాహి వాహనం ఇప్పటికే రోడ్డెక్కక పోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్స్ వేశారు. కాపు యువ‌కుడు కష్టపడి సంపాదించిన డ‌బ్బుతో వారాహి వ్యాన్‌ ను కొనిచ్చిన‌ట్టు నాని చెబుతున్నారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌ లో దుర్గమ్మ గుడి వ‌ద్ద పూజ‌లు చేయించి, ద‌స‌రా త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ప‌వ‌న్ చెప్పాడ‌ని గుర్తు చేశారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌ లో ఎన్నిక‌లొస్తే.. జూన్ నుంచి జనాల్లో తిరుగుతానంటూ ష‌ర‌తులు పెడుతున్నాడ‌ని నాని దెప్పి పొడిచారు. రాజ‌కీయాల్లో ఇంత‌టి ప‌నోడు మ‌న‌కు ఎవ‌రూ దొర‌క‌రంటూ మాట‌ల‌తో కుళ్ల పొడిచారు.

ఈ సందర్భంగా… పేర్ని వ్యాఖ్యలపై స్పందించిన మాజీ జనసైనికులు… వారాహి వాహ‌న తాళాలు చంద్రబాబు చేతిలో ఉన్నాయ‌ని, ఆయ‌న వాటిని ఇస్తే త‌ప్ప యాత్ర మొద‌లుపెట్టలేని దుస్థితి నెల‌కుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ అవుతుంది. పవన్ పై ఇంతకాలం గుడ్డి నమ్మకాన్ని, పిచ్చి ప్రేమనూ చూపించిన జనసైనికులు… టీడీపీ కోసం పనిచేయాలని పవన్ పిలుపు వల్ల మాజీలుగా మరిన అనంతరం.. వారి ఆగ్రహానికి వెటకారాన్ని దట్టించి ఇలా ఆన్ లైన్ వేదిగా ఇలా స్పందిస్తున్నారు.