ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలలో కొన్ని నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయనే సంగతి తెలిసిందే. ఏపీలోని పలు జిల్లాలలో చెత్తపన్ను విషయంలో ప్రభుత్వం నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చెత్తపన్ను వసూళ్ల కోసం వెళ్లిన సచివాలయ సిబ్బందిపై కూడా పలువురు సీరియస్ అవుతున్న సందర్భాలు సైతం ఉన్నాయి. చెత్తపన్ను వసూళ్లను నిలుపుదల చేయాలని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
చెత్తపన్ను చూడటానికి చిన్న సమస్యలా అనిపించినా ప్రజల్లో వ్యతిరేకత వస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఆశించిన స్థాయిలో విజయం సాధించే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. మరోవైపు సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లను బాగు చేయడానికి, కొత్తగా రోడ్లు వేయడానికి సకాలంలో నిధులు అందించకపోవడం వల్ల తరచూ ప్రయాణాలు చేసేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపు, కరెంట్ ఛార్జీల పెంపు సైతం జగన్ సర్కార్ కు మైనస్ అవుతుండటం గమనార్హం. మరోవైపు అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ పథకాలు అందని వాళ్లు సైతం జగన్ సర్కార్ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ సర్కార్ చేస్తున్న చిన్నచిన్న తప్పులు ఆ పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం చేస్తున్నాయి. జగన్ సైతం ప్రజల్లోకి రావడానికి ప్రాధాన్యతనిస్తే మంచిదని చెప్పవచ్చు.
సమస్యల విషయంలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వైసీపీ 2024లో అధికారంలోకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. 2024 ఎన్నికలకు మరో 20 నెలల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. జగన్ వాస్తవాలను తెలుసుకోవాలని ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే 2024లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.