2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ కు ఏ స్థాయిలో గౌరవం ఇచ్చిందో తెలియనిది కాదు. అయితే నందమూరి తారకరత్న తాజాగా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తారని తెలిపారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఇదే మాట చెప్పించే దమ్ము, ధైర్యం టీడీపీ నేతలకు ఉందా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ అంటే ఏ స్థాయిలో అసహ్యం ఉందో టీడీపీ సన్నిహితులకు తెలుసు. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ప్రస్తుతం గ్యాప్ ఉంది. అయితే డైరెక్ట్ గా ఆ విషయాలను వెల్లడించి కుటుంబానికి, పార్టీకి చెడ్డపేరు తీసుకురాకూడదని తారక్ భావిస్తుండటం గమనార్హం. ఈ వివాదంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను లాగడం వల్ల నష్టపోయేది టీడీపీనే అని చెప్పవచ్చు.
టీడీపీ అధికారంలోకి రావడం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను వినియోగించుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం తారక్ టీడీపీ తరపున ప్రచారం చేస్తారని వస్తున్న వార్తల విషయంలో సంతృప్తితో లేరు. తారక్ ఎన్నికల్లో ప్రచారం చేసినా ఆయనను కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తారకరత్న కామెంట్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించే అవకాశం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేయడం కలలో కూడా జరగదు. అలాంటి ఆశలు ఏవైనా ఉంటే టీడీపీ వాటిని మరిచిపోతే మంచిదని చెప్పవచ్చు.