వైసీపీ నేతల భాష మారాల్సిందే.. ఏపీ సీఎం జగన్ కు అర్థమవుతోందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీడియా ముందు మాట్లాడే మాటల విషయంలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించి వైరల్ అయిన వీడియో ఫేక్ వీడియో అంటూ ఎస్పీ ప్రకటించిన తర్వాత గోరంట్ల మాధవ్ హద్దులు దాటి కామెంట్లు చేయడం గమనార్హం. కొంతమందిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇష్టానుసారం మాట్లాడే నేతలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ నేతలు ఇదే విధంగా కామెంట్లు చేస్తే భవిష్యత్తులో వైసీపీ పరువు పోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోరంట్ల మాధవ్ మాటల వల్ల హర్ట్ అయిన రాధాకృష్ణ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇష్టానుసారం చేసే వ్యాఖ్యల వల్ల వైసీపీ పరువు పోతుందనే విషయాన్ని జగన్ గుర్తిస్తే మంచిదని చెప్పవచ్చు.

వైసీపీ నేతల కామెంట్ల వల్ల వైసీపీకి నష్టమే ఎక్కువగా జరుగుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటల వల్ల పొయ్యేది వైసీపీ పరువేనని చెప్పవచ్చు. కొన్ని నెలల క్రితం రోజా రాణి అనే వైసీపీ నేత సైతం ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రాయడానికి, ఉచ్చరించడానికి వీలు లేని దూషణలు రాజకీయ పార్టీలకు ఏ మాత్రం మంచివి కావు.

సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా కొందరు వైసీపీ నేతల భాష ఉంది. కొంతమంది వైసీపీ నేతలకు ఈ భాష నచ్చినా సొంత పార్టీ నేతలే ఈ తరహా వ్యాఖ్యల విషయంలో విమర్శలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇష్టానుసారం కామెంట్లు చేసే నేతల వల్ల పార్టీ మునిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఈ విషయంలో మారతారేమో చూడాల్సి ఉంది.