రివ్యూ : ‘నేనే వస్తున్నా’ :

nene vasthunnaa movie review

 

నటీనటులు: దనుష్, ఎలి అవ్రమ్, ఇంధుజ, యోగి బాబు తదితరులు.

దర్శకుడు: సెల్వ రాఘవన్
నిర్మాత: కలైపులి ఎస్ థాను
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్

హీరో ధనుష్‌ ‘నేనే వస్తున్నా’ అంటూ ఈ రోజు తన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

 

కథ :

ప్రభు (ధనుష్) – ఖదీర్ (రెండో ధనుష్) ట్విన్స్. అయితే, ఖదీర్ చిన్న తనం నుంచి సైకో లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ప్రభు – ఖదీర్ చిన్న తనంలోనే విడిపోతారు. ముప్పై ఏళ్ల అనంతరం అంటూ కథ ముందుకు సాగుతుంది. ప్రభు తన కూతురు, భార్యతో చాలా సంతోషంగా ఉంటాడు. అయితే, ఉన్నట్టు ఉండి ప్రభు కూతురికి సోను అనే దెయ్యం కనిపిస్తూ టార్చర్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ సోనూ దెయ్యం ఎవరు ?, ఎందుకు ప్రభు కూతుర్నే టార్గెట్ చేసింది ?, ఎందుకు ఖదీర్ ను చంపాలని కోరుకుంది ?, మరి ప్రభు తన కూతురు కోసం ఖదీర్ ను చంపాడా?, లేదా ? వీరిద్దిరి మధ్య ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

 

nene vasthunnaa movie review
nene vasthunnaa movie review

విశ్లేషణ :

నేనే వస్తున్నా రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లా కాకుండా మంచి థీమ్ తో తెరకెక్కింది. ముఖ్యంగా ధనుష్ ఖదీర్ క్యారెక్టర్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయడం, అలాగే సినిమాలో కొన్ని హార‌ర్‌ ఎఫెక్ట్స్ బాగుండటం, అలాగే ఇంటర్వల్ లో యాక్షన్ అండ్ ట్విస్ట్ హైలైట్‌ అవ్వడం వంటి అంశాలు నేనే వస్తున్నా సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్ గా గడిచిపోతుందనుకున్నా.. దర్శకుడు సెల్వ రాఘవన్ సెకండ్ హాఫ్ ను మాత్రం ఎఫెక్టివ్ గా తీయలేక పోయాడు.

అయితే, ధనుష్ మాత్రం తన నటనతో అధ్భుతంగా ఆకట్టుకున్నాడు. మెయిన్ గా ఖదీర్ పాత్రలో జీవించాడు. సైకో లక్షణాలు ఉన్న ఖదీర్ గా ధనుష్ చాలా సహజంగా నటించాడు. మిగిలిన నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఎలి అవ్రమ్ నటన బాగుంది. అలాగే ఈ సినిమాకి మరో ప్రధానాకర్షణ ఇంధుజ. ఆమె కూడా చాలా బాగా నటించింది.

యోగిబాబు, ప్రభు లతో సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేసి తమ నటనతో మెప్పిస్తారు. అయితే, రెండు గంటలు పాటు నేనే వస్తున్నా చిత్రం ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. దర్శకుడు సెల్వ రాఘవన్ కనీసం హర్రర్ అండ్ ఏమోషనల్ సన్నివేశాలతో కూడా పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు.

 

 

ప్లస్ పాయింట్స్ :

ధనుష్ నటన

ఎమోషనల్ గా సాగే కూతురు డ్రామా

కొన్ని సప్సెన్స్ సీన్స్

డైరెక్షన్

 

 

మైనస్ పాయింట్స్ :

ప్లే బోర్ గా సాగడం,

అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు

బోరింగ్ ట్రీట్మెంట్,

రెగ్యులర్ హారర్ డ్రామా

లాజిక్ లెస్ యాక్షన్ సీన్స్.

 

తీర్పు :

ధనుష్ హీరోగా ‘నేనే వస్తున్నా’ అంటూ వచ్చిన ఈ సప్సెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల్లకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో ఫెయిల్ అయింది. అయితే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ, సినిమాలో కీలక సన్నివేశాలు కూడా బాగా స్లోగా అండ్ బోర్ గా సాగాయి. అక్కడకడ వర్కౌట్ కాని హారర్ సీన్స్ కూడా ఈ సినిమాకి బలహీనతలుగా మిగిలాయి. మొత్తమ్మీద భిన్నమైన, కొత్త తరహా చిత్రంలో ఏ రకమైన కొత్తదనం లేదు. ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చదు.

 

రేటింగ్ : 2.25 / 5

బోటమ్ లైన్: నేనే వస్తున్నా..  రానక్కర్లేదు!