ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు చెప్పినవన్నీ అబద్ధాలే నని తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ ఆరోపించారు. ప్రధాని మోదీతో పాటు ఆర్థిక మంత్రి జైట్లీ కూడా నోటికొచ్చినట్లు అబద్దాలు చెప్పి తెలుగు ప్రజలను మోసగించారని విమర్శించారు. ఈ రోజు లోక్సభలో మోదీ ప్రభుత్వం మీద ఆవిశ్వాసం తీర్మానం ప్రవేపెడుతూ మోదీ నాలుగు సంవత్సారలలో అబద్దాలు చెప్పి ఎలా కాలక్షేపం చేశారో ఉదాహరణలతో సహా వివరించారు
జయదేవ్ ప్రస్తావించిన మోదీ, జైట్లీ అబద్దాలులలో కొన్ని…
- ప్రత్యేక హోదా ను రద్దు చేస్తున్నామని చెప్పి 11 రాష్ట్రాలకు హోదో కొనసాగిస్తూ 2016 సెప్టెంబర్ లో ఉత్తర్వులిచ్చారు.
- ఆంధ్ర ప్రదేశ్ నిధులు ఖర్చు చేయలేదనడం పచ్చి అబద్దం. 94 శాతం ఖర్చుచేశారు. కేంద్రం మాత్రం 12 శాతమే అనడం అబద్దం.
- రాయలసీమ ఉత్త రాంధ్ర వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదు. రు. 350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు. బుందేల్ ఖండ్ కు రు. 7200 కోట్లు ఇచ్చారు. ఈవితరణ ఆంధ్రలోని వెనకబడిన ప్రాంతాల మీద చూపలేదెందుకు?
- నాలుగు సంవత్సరాలలో బుందేల్ ఖండ్ కు 20 వేల కోట్ల రుపాయలిచ్చారు.
- రాష్ట్రానికి నిధులందించడంలో కేంద్రం డిలేడ్ టాక్టిక్స్ (వాయిదా వేసే దోరణి) అనుసరిస్తున్నది
- ఆంధ్రాకి ఇస్తామన్న దాంట్లో పదో వంతుకూడా ఇవ్వలేదు. అయినా హామీలన్నీ అమలుచేశామని అంటున్నాది. ఇది సిగ్గుపడాల్సిన విషయం.
- 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రద్దు చేసిందని, ఇక ముందు ఏ రాష్ట్రానికి ఇవ్వొద్దని సిఫార్సుచేసిందని కేంద్రం చెప్పింది అబద్దం. 14వ ఆర్థిక సంఘం అలా అనలేదని ఈ సంఘానికి ప్రాతినిధ్యం వహించిన గోవిందరావు వెల్లడించారు. ఇలాంటి అవాస్తవాలను ప్రధానిమెదీ, ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పడం న్యాయమా
- బిజెపి అధికారంలోకి వస్తే అమరావతి ఢిల్లీకంటే గొప్పగా నిర్మిస్తామని ప్రధాని మోదీ చెప్పలేదా; అస్తానా నగరాన్ని చూసి రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్పలేదా. ఇదే మయింది.
- మహారాష్ట్ర లో శివాజీ విగ్రహానికి 300 కోట్ల రుపాయలు, గుజరాత్ లో పటేల్ విగ్ర హానికి రు. 2000 కోట్లు ఇచ్చయారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అందించింది కేవలం రు. 1500 కోట్లు. ఇందులో వేయి కోట్లు గుంటూరు విజయవాడ నగరాలలో డ్రైనేజీ నిర్మాణాలను మెరుగుపరిచేందుకు ఇచ్చారు.
- రు. 16 వేల కోట్ల రెవిన్యూలోటు ఉంటే , విభజన చట్ట ప్రకారం దీన్నుంచి భర్తీ చేయాల్సింది కేంద్రమే అయినా, ఇచ్చింది రు. 3900 కోట్లే.