పవన్ కళ్యాణ్‌తో బాలకృష్ణ.! కాపు సెంటిమెంట్ సంగతేంటి.?

నిన్ననే కాపునాడు జరిగింది. ఓ వైపు కాపునాడు.. ఇంకో వైపు కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్ధంతి నేపథ్యంలో రంగా విగ్రహావిష్కరణల హంగామా నడిచింది.

కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం.. అనే నినాదంతో ఆ సామాజిక వర్గ ప్రముఖులు గత కొన్నాళ్ళుగా హంగామా చేస్తున్నారు. కాపు నాయకుడైన రంగా ఎదుగుదలను ఓర్వలేక టీడీపీనే ఆయన్ని చంపేసిందన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ.

ఇక, తాజాగా పవన్ కళ్యాణ్ – నందమూరి బాలకృష్ణ కలిశారు. అదీ ఆహా ఓటీటీపై నడుస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో కోసం. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నమాట వాస్తవం. బాలకృష్ణ కేవలం సినీ నటుడే కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా. పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత కూడా.

సో, ఈ ఇంటర్వ్యూ విషయమై సినీ వర్గాలతోపాటు, రాజకీయ వర్గాల్లోనూ ఒకింత స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ‘పవన్ నాయుడూ.. బాలకృష్ణతో చేతులు కలిపి, కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేశావ్ కదా..’ అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఓ వింత వాదనకు తెరలేపింది.

పవన్ కళ్యాణ్ రెండో భార్య ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత భార్య అన్నా లెజినెవా అయితే ఏకంగా రష్యన్ మహిళ. అయినా, ఇప్పుడు కులాల ప్రస్తావన ఏంటి.?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు. ఆ కోణంలో చూస్తే మతం మారాక, అంతకు ముందున్న సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకోరు. లోకం చాలా మారింది. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నా, హిందూ సంప్రదాయాల్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో పాటించాల్సిందే.

రాజకీయాల్లో అంతే మరి.! ఇక్కడ పవన్ – బాలకృష్ణ ఇంటర్వ్యూ ఓ ఇంటర్టైన్మెంట్ వ్యవహారం. దానికీ, కాపు రాజకీయానికీ లింకేంటి.?