ఒలింపిక్స్ బిడ్ కోసం మోడీ ప్రయత్నం… అట్లుంటది చంద్రబాబు విజనంటే…!

2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం చంద్రబాబు చెప్పిన మాటలు, చేసిన చేతలు, నడుచుకున్న విధానం మొదలైనవి అన్నీ ఇన్నీ కాదని.. చేసిన తప్పులు. ప్రజలను ఏమార్చిన విధానాలూ అంతా ఇంతా కాదని.. నియంతృత్వ మనస్తత్వాన్ని నింపుకున్నట్లు పాలించారని.. తోకలు కత్తిరిస్తానని ప్రజలనుద్దేశించి మాట్లాడే స్థాయి బలుపు తెచ్చేసుకున్నారని రకరకాల కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో ఒలింపిక్స్ టాపిక్ తెరపైకి వచ్చింది.

వినేవాడు ఆంధ్రుడైతే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా చంద్ర్బాబు పాలన 2014 తర్వాత సాగిందని అంటుంటారు పరిశీలకులు. ఏ దేశానికి వెళ్లి తిరిగొస్తే… అమరావతిని ఆ దేశ రాజధానిలాగానే నిర్మించబోతున్నాని చెప్పిన విధానం బాబు సొంతం. సినిమా దర్శకులతో రాజధాని డిజైన్స్ చేయించాలని అడిగిన విజనరీ చంద్రబాబు సొంతం. పుష్కరాలలో సినిమా డైరెక్టర్లతో షూటింగ్స్ చేయించుకుని.. ప్రజల ప్రాణాలు బలిగొన్న విజనరీ బాబు!

ఈ క్రమంలోనే 2018లో ఒలింపిక్స్ తీసుకువస్తానని.. అది కూడా అమ‌రావ‌తిలో జరిపిస్తామని.. ఒలింపిక్స్ లో గెలిస్తే నోబెల్ బ‌హుమ‌తి ఇస్తామని… చంద్రబాబు చెప్పిన కబుర్లు అన్నీ ఇన్నీ కాదు! కాస్త ఇంగితం ఉన్నవారెవరైనా ఇలా మాట్లాడతారా అనేది అప్పట్లో జరిగిన చర్చ. దౌర్భాగ్యం ఏమిటంటే… ఈ వ్యాఖ్యలను కూడా సమర్ధించగలని మూర్ఖులు ఉండటం! ప్రజలను ఆస్థాయిలో ఏమార్చ డానికి ప్రయత్నాలు జరితాయి.

ఫలితం 2019 ఎన్నికల్లో కళ్లకు కట్టినట్లు కనిపించింది. ప్రజలే… చంద్రబాబు తోక కత్తిరించినంత పనిచేశారనే కామెంట్లు వినిపించాయి. ఆ సంగతి అలా ఉంటే… ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై, రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ సమయంలో ఒలింపిక్స్ బిడ్ కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.

2036లో.. అంటే.. మరో 13 ఏళ్ల తర్వాత జ‌ర‌గ‌బోయే ఒలింపిక్స్ కు ఇప్పుడు బిడ్డింగులు జ‌రుగుతున్నాయట! దీంతో… అది ఎలాగైనా ద‌క్కించుకోవాలని మోడీ చెబుతున్నారంట. అంటే ఆ ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు కానీ… ప్రస్తుతానికి ప్రయత్నాల స్టేజ్ లోనే ఉందన్నమాట. ఈ ఒక్కమాట చాలు.. ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ అంటే ఏ స్థాయి అంశమో అర్ధం కావడానికి.

మరి అలాంటి ఒలింపిక్స్ ని అమ‌రావ‌తిలో, అది కూడా 2018లో అని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో బాబునే అడగాలి! పైగా ఒలింపిక్స్ లో గెలిచిన వారికి నోబెల్ బహుమతి అని ప్రకటించడం ఏమిటో బాబుకే తెలియాలి.. లేదా, ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్స్ కి తెలియాలి… అందుకే జనాలు అర్ధం కాక, 2019 తర్వాత ఇంటికి పంపించేశారు. నాడు చేసిన పనులకు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.

అందుకే అంటారు.. కాలం చాలా గొప్పది, ఎవరినీ వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది అని!! ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… సపోజ్ 2036 ఒలింపిక్స్ నిర్వహణ భారత్ కు దక్కితే… ఇది కూడా బాబు విజన్ ఖాతాలో వేసేస్తారు కొంతమంది అజ్ఞానులు! చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ ఆలోచన చేశారు.. ఆయన విజన్ అంతాలా ఉండేది.. ఇప్పుడు దాన్ని మోడీ కాపీ కొట్టి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పగలరు! అందుకే… వినేవాడు ఆంధ్రుడైతే చెప్పేవాడు చంద్రబాబు విత్ ఎల్లో మీడియా!