లోకేష్ యువగళం మిడిల్ డ్రాప్… కారణం ఇదే?

టీడీపీలో కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమై ఇప్పటికి 185 రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్రవల్ల పార్టీకి కానీ, పర్యటించిన నియోజకవర్గాల్లో నాయకులకు కానీ కలిగించిన మేలు ఎంత అంటే… ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అని అంటున్నారు! దీంతో ఈ యువగళం యాత్రను మిడిల్ డ్రాప్ చేయాలని భావిస్తున్నారంట టీడీపీ పెద్దలు!

అవును… అటు పవన్ వారాహి యాత్రకు మీడియా కవరేజ్ ఫుల్ గా దక్కుతుంది. ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనకూ ఎల్లో మీడియాలో కవ్రేజ్ కి లోటు లేదు. కాకపోతే యువగళం పాదయాత్రకు జనాల స్పందన సంగతి కాసేపు పక్కనపెడితే… అనుకూల మీడియాలో సైతం కవరేజ్ రాని పరిస్థితి. పైగా.. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ అదనపు ఖర్చు అవసరమా మాకు అంటూ కొంతమంది స్థానిక టీడీపీ నేతలు బహిరంగంగానే వాపోతున్నారని అంటున్నారు.

దీంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా వ్యవహారం మారే ప్రమాధం పొంచి ఉందని ఆలస్యంగా గ్రహించారో ఏమో కాని… లోకేష్ పాదయాత్రను అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి వరకూ కాకుండా… నవంబర్ నెలలోనే పూర్తిచేసేలా షార్ట్ కట్ ప్లాన్ ఒకటి ఆలోచింస్తున్నారని అంటున్నారు. దీంతో… నారా లోకేశ్ యువగళం యాత్ర షెడ్యూల్ కంటే ముందుగానే ముగియబోతోందని తెలుస్తోంది.

వాస్తవానికి జనవరి 27 నుంచి ప్రారంభించిన పాదయాత్ర 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు పాటు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించాలని షెడ్యూల్‌ ను పార్టీ నాయకత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది మార్చి 1తో యాత్ర ముగించాల్సి ఉంది. అయితే ఈ వృధాప్రయాసను అప్పటివరకూ కొనసాగించడం వృధా ప్రయాసే అని పలువురు బాబు వద్ద వాపోతున్నారని సమాచారం.

దీంతో… ఇక చినబాబుని, టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టకూడదని భావించిన అధిష్టాణం ఇకపై బాబు యాత్రను కనీసంలో కనీసం మూడు నాలుగు నలల ముందే ఆపేయాలని భావిస్తున్నారంట. ఫలితంగా… ఉమ్మడి కృష్ణా జిల్లాలో7 రోజులపాటు 4 నుంచి 5 నియోజకవర్గాలకే పరిమితం కానుందని అంటున్నారు.

అయితే ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం 60 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలు కీలకం కావటంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సమయం కేటాయించనున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ… లోకేష్ పాదయాత్రకు త్వరలోనే స్వస్థి చెప్పి టిక్కెట్ల కేటాయింపు, పొత్తు చర్చల్లో కీలక భూమిక పోషించబోతున్నారని అంటున్నారు!