Nara Lokesh: వైయస్ జగన్మోహన్ రెడ్డి హయామంలో తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. గతంలో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ వాలంటీర్ వ్యవస్థను పూర్తిస్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా వాలంటీర్ వ్యవస్థ గురించి ఎంతో ఘోరంగా మాట్లాడారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తాము కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని 5000 కు బదులుగా 10000 రూపాయల జీతం అందిస్తామంటూ భారీ స్థాయిలో ప్రచారం చేశారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఇలా వాలంటీర్లకు ఇచ్చిన హామీ కూడా కూటమి గెలుపుకు కొంతవరకు కారణమనే చెప్పాలి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విషయం గురించి క్లారిటీ ఇవ్వలేకపోయింది దీంతో వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని తిరిగి విధులలోకి తీసుకోవాలి అంటూ నిరసనలు తెలియజేస్తున్నారు.
ఇలాంటి తరుణంలోనే మంత్రి నారా లోకేష్ వాలంటీర్ వ్యవస్థ గురించి క్లారిటీ ఇచ్చారు ఇకపై వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేమని ఆయన క్లారిటీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను కనుక కొనసాగిస్తే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం అంటే పుట్టని బిడ్డకు పేరు పెట్టడమే అంటూ ఈయన తెలిపారు. వాలంటీర్లపై GO రెన్యువల్ చేయకపోవడం ఎందుకు అని ప్రశ్నించారు.
వాలంటీర్లను ఉద్యోగాల్లో కొనసాగించకపోవడమే కాకుండా, ఎన్నికల సమయంలో 80% మందితో రాజీనామా చేయించినట్లుగా కనిపిస్తోంది. దీనిపై జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం పట్ల ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి అంటూ లోకేష్ ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం పట్ల చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈయన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉండదని అర్థమవుతుంది.