తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవ సభ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితమే పార్టీ నేతలకు చెందినవారి ఇండ్లను కూల్చివేసేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది. తమ పార్టీ నేతలను పరామర్శించేందుకు, శ్రీకాకుళం పర్యటనలో భాగంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో పలాస వెళ్తుండగా శ్రీకాకుళం సమీపంలోని జాతీయ రహదారిపై పోలీసులు లోకేష్ ను అడ్డుకున్నారు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డు జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చిన్న రాజప్ప, ఇతర నేతలు రోడ్డుపై కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది పార్టీ కార్యకర్తలను నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేష్ పలాస పర్యటన ముఖ్య ఉద్దేశం పలాస లోని ఒక చెరువుని ఆక్రమించి అక్రమంగా కట్టడాలను నిర్మించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
టీడీపీ శ్రేణులు దీనిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పలాస ఎమ్మెల్యే మంత్రి సీదిరి అప్పలరాజు పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇంచార్జ్ గౌతు శిరీష వ్యక్తిగత దూషణలు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈనెల 18 లోగా ఆమె క్షమాపణ చెప్పకుంటే 21న టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు.
ఈ విషయంపై శిరీష స్పందించకపోవడంతో వైసీపీ కార్యకర్తలు బస్టాండ్ కాంప్లెక్స్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. శిరీష తమ పార్టీ కార్యాలయంలోనే ఉంటామని ఎలా ముట్టడిస్తారో చూస్తానని సవాలు విసిరారు. ఈ ఉద్రిక్తత జరుగుతుండడంతో నారా లోకేష్ ను శ్రీకాకుళం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.