కొత్త స్టేట్ మెంట్: పవన్ ది బెదురు… లోకేష్ ది తెగింపు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోందనే కామెంట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తనకు భయం లేదని ఒకటికి రెండు సార్లు చెప్పుకునే పవన్ కు అత్యంత భయం అని… పైకి కాస్త అటు ఇటుగా అనిపించినా లోకేష్ కే ధైర్యం ఎక్కువని అంటున్నారు పరిశీలకులు.

అవును… పవన్ కు చాలా భయం – లోకేష్ కు తెగింపు ఎక్కువ అనే విషయాలపై తాజాగా ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. దానికి కారణం.. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే నియోజకవర్గాల విషయంలో వారు అవలంభించిన వైఖరే కారణం అని తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ తో పోలిస్తే లోకేష్ గట్స్ ఉన్న నేతని అంటున్నారు.

గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత హోదాలో భీమవరం, గాజువాకల్లో పోటీచేసిన పవన్ రెండుచోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కొడుకుగా, మంత్రిగా పనిచేసి రంగంలోకి దిగిన లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. ఇద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేసింది మొదటిసారే. సరే ఇద్దరి రాజకీయ కెరీర్ లో అదో పీడకల అని సరిపెట్టుకుంటే మళ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది.

దీంతో… వ‌చ్చే ఎన్నికల్లో అయినా కచ్చితంగా గెలవాలనే పట్టుదలకు బదులు మళ్ళీ ఓటమి భయమే ఎక్కువగా కనబడుతోందట ఈ నేతలకు. ఇందులో భాగంగా… తాను ఏ నియోజకర్గంలో పోటీ చేసేది ఇప్పుడే చెప్పేస్తే తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి రూ.200 కోట్లు ఖర్చుపెడతారని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. అంటే జగన్ దెబ్బకు పవన్ భయం పీక్స్ లో ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక ఇక లోకేష్ అయితే ఆ మధ్య మంగళగిరిలో పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ లోలోపల మాత్రం పునరాలోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో జగన్ ప్రభుత్వం 51 వేల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన తర్వాత పోటీ విషయమై లోకేష్‌ రెండో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. భీమిలీ, హిందుపురం, పెనమలూరు నియోజకవర్గాల్లో పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నారంటు ప్రచారం జరుగుతోంది.

పవన్ ఆ స్థాయిలో బెదిరిపోతుంటే… చినబాబు లోకేష్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. మరోసారి మంగళగిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో భాగంగా… రాబోయే ఎన్నికల్లో తాను మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేయబోతున్నట్లు లోకేష్ తాజాగా ప్రకటించారు. దీంతో… రెండు చోట్ల అవకాశం ఉన్నప్పటికీ పవన్ ఆ ధైర్యం చేయలేకపోతున్నా.. చినబాబు మాత్రం గట్స్ తో ఉన్నారని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… పవన్ తో పాటు లోకేష్ కూడా బెదురు మనిషే అని అంటున్నారు మరికొంతమంది. ఎన్నికల వరకూ పైకి మీడియా ముందు అలా హడావిడి చేస్తున్నాడే తప్ప… తెర వెనుక సేఫ్ జోన్ ల గురించి ఆరా తీస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా భీమిలీ, హిందుపురం, పెనమలూరు నియోజకవర్గాల్లో పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నారని అంటున్నారు.

అయితే టీడీపీకి మరింత సేఫ్ ప్లేస్ అయిన ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడలో పోటీ చేసి సత్తా చాటాలని అనుకుంటున్నా.. కొడాలి నాని కళ్లోకి వస్తున్నాడని చెబుతున్నారు. దీంతో… ప్రస్తుతానికి మంగళగిరి మాటలే మాట్లాడి.. చివరి నిమిషంలో హిందూపూర్ వైపు చూడొచ్చనే ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు.

ఇక మరోపక్క… భీమవరం, గాజువాకల్లో దెబ్బతిన్న పవన్ కల్యాణ్ ఈసారి తిరుపతి, భీమిలీ, నరసాపురం, విశాఖ ఉత్తరం, పిఠాపురం నియోజకవర్గాల్లో తెగ సర్వేలు చేయిస్తున్నారని సమాచారం. వీటిలో ఏ సర్వేలో ఎక్కువ సానుకూల ఫలితాలు వస్తే ఆ నియోజకవర్గంలో పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇంతకూ పార్టీ అధినేత హోదాలో పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి!