చంద్రబాబు జైల్ లైఫ్ @ 50… లోకేష్ కొత్త ప్రోగ్రాం షురూ!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు జైలు జీవితం హాల్ఫ్ సెంచరీ రోజులకు చేరుకుంది. ఆదివారం చంద్రబాబు అరెస్టై 50 వరోజు! ఈ సందర్భంతోపాటు గత కొన్ని రోజులుగా ప్రతీ వారాంతంలోనూ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నారా లోకేష్ కొత్త పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా.. కళ్లకు గంతలు కట్టుకోవ్మని పిలుపునిచ్చారు. అలా కళ్లకు గంటలు కట్టుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో చిత్ర విచిత్రమైన నిరసనల పేరుతో ఏపీ రాజకీయాల్లో టీడీపీ తనదైన నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్లిసిందే. ఆ కార్యక్రమాల వల్ల వారు ఆశిస్తున్నది ఏమిటన్న సంగతి కాసేపు పక్కనపెడితే.. తాజాగా ఈ లిస్ట్ లో మరో వెరైటీ నిరసన చేరింది. ఆ నిరసనకు లోకేష్ పెట్టిన పేరు “కళ్లు తెరిపిద్దాం”. ఇందులో భాగంగా… దీనికోసం ప్రజలంతా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలపాలలి.

ఈ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్యలో ప్రజలంతా కళ్లకు గంతలు కట్టుకొని బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా “నిజం గెలవాలి” అంటూ గట్టిగా నినాదాలు చేయాలని ఆన్ లైన్ వేదికగా పిలుపునిచ్చారు నారా లోకేష్. అలా కళ్లకు గంతలు కట్టుకున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు.

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం. ఆదివారం రాత్రి 7.00 నుంచి 7.05 నిమిషాలు మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా “నిజం గెలవాలి” అని గట్టిగా నినదించండి. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయండి‌” అని లోకేష్ ట్వీట్ చేశారు.

దీంతో కొంతమంది నెటిజన్లు చినబాబు డిఫరెంట్ నిరసన కార్యక్రమాలపై సెటైర్లు పేలుస్తున్నారు. ఇందులో భాగంగా… గంటలు కొట్టడం, పళ్లాలపై గరిటెలతో కొట్టడం.. ఇలాంటి చిత్రవిచిత్రమైన నిరసనల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలని సూచిస్తున్నారు. మొదటి కార్యక్రమానికే స్పందన లేనప్పుడు, రెండో కార్యక్రమానికి రియాక్షన్ రానప్పుడు ఆపేయడం మానేసి… ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడం వల్ల మరింత చులకన భావం ఏర్పడే అవకాశం ఉందని గుర్తుచేస్తున్నారు.

ఇందులో భాగంగా… ఇటీవల దసరాకు “సైకో పోవాలి” అనే నినాదాన్ని రాసిన పేపర్లను దహనం చేసే కార్యక్రమానీకి పిలుపు నివ్వడం, ఇటీవల చేతులకు సంకెళ్లు వేసుకుని చేపట్టిన నిరసన కూడా అదే కోవలో ఉందని చెబుతున్నారు. పైగా చేతులకు సంకేళ్లు కార్యక్రమంలో… సెల్ ఫోన్ చార్జింగ్ వైర్లు, కుక్కలకు వేసే గొలుసులు కట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడంతో వెటకారంగా తీసుకుంటున్నారని తెలిపారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… దసరాకే ధమాకా చూపించారు.. ఇప్పుడు కళ్లకు గంతలు కట్టుకుని గట్టిగా అరవాలంటున్నారు.. ఈ లెక్కన దీపావళికి ఎలాంటి ప్రత్యేక ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారో అని కొంతమంది ఆసక్తిగా చూస్తుంటే.. మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఏది ఏమైనా… ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్లిన అంశాలపై ఇలాంటి చేష్టలేమిటో చినబాబుకే తెలియాలనేది లేటేస్ట్ కామెంట్!