మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో వెనక్కు తగ్గారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎంత కష్టపడినా మంగళగిరి నియోజకవర్గంలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఏ మాత్రం లేకపోవడంతో లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పలు నియోజకవర్గాలలో లోకేశ్ ప్రస్తుతం సర్వేలు చేయించుకుంటున్నారు.
ఆ సర్వేలలో వచ్చే ఫలితాలను బట్టి అక్కడ పోటీ చేయాలా? వద్దా? అనే విషయంలో లోకేశ్ తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. మంగళగిరిలో పోటీ చేస్తే ఓటమి తప్పదని లోకేశ్ ఫిక్స్ అయ్యారని బోగట్టా. మంగళగిరిలో వైసీపీకే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో లోకేశ్ నియోజకవర్గం మార్పుపై దృష్టి పెట్టారని బోగట్టా.
లోకేశ్ పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల జాబితాలో హిందూపురం, భీమిలి, పెనమలూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. బాలకృష్ణను హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని లోకేశ్ భావిస్తున్నారని సమాచారం. ఈ ప్రతిపాదనకు బాలయ్య వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య ఈ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశాలు తక్కువేననే సంగతి తెలిసిందే.
బాలయ్య ఒప్పుకోని పక్షంలో మరో నియోజకవర్గంపై లోకేశ్ దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న లోకేశ్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇతర పార్టీ నేతలకు నవ్వు తెప్పిస్తోంది. లోకేశ్ 2024 ఎన్నికల్లో కూడా ఓటమిపాలైతే రాజకీయాలకే దూరమయ్యే పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.