నాన్నారూ నడవలేకపోతున్నా.! లోకేష్ ఆవేదన ఇదేనా.?

ఎవరేమన్నా అనుకోని.. తన పని తాను చేసుకుపోతున్నారు నారా లోకేష్. ‘సైకిల్‌కి ఓటెయ్యొద్దంటారు’.. ఇంకోటేవో చెబుతారు. మాట తడబడుతోంది.. నడక కూడా గతి తప్పుతోంది. ఈ రోజుల్లో పాదయాత్రలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. గడచిపోయిన కాలమే గొప్పది.. నడుస్తున్నదంతా కష్టకాలమే.. అది ఏ రకంగానైనా.!

రాజకీయంగా బోల్డన్ని ఆంక్షలు.. చీమ చిటుక్కుమన్నా.. గొల్లున హంగమా చేసే సోషల్ మీడియా.. వెరసి, చిన్న చిన్న పొరపాట్లే.. పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతుంటాయ్. ట్రోలింగ్‌కి భయపడే క్రమంలో.. మాట, నడక.. రెండూ తడబడిపోతాయ్. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర.. చివరి వరకూ జరిగేలా కనిపించడంలేదు. ఏదో ఒక కుంటి సాకు చూపించి, పాదయాత్రను ఆపేసుకోవడమే బెటర్.. అన్న చర్చ టీడీపీలోనే జరుగుతోంది. పాదయాత్రను ఆపేసి.. బస్సు యాత్ర చేస్తే, ఒకింత సౌకర్యంగా వుంటుందన్నది టీడీపీలో జరుగుతున్న చర్చ అట.

కానీ, ప్రెస్టీజియస్ ఇష్యూ అయి కూర్చుంది పాదయాత్ర. ఎలాగైనా నాలుగు వేల కిలోమీటర్ల నడక పూర్తి చేసేసి, సరికొత్త రికార్డు తన పేరున రాసేసుకోవాలని నారా లోకేష్ ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ, అందుకు శరీరం సహకరించొద్దూ.? రానున్నది వేసవి కాలం. ఈ ఏడాది ఎండలు అప్పుడే మండిపోవడం మొదలైంది.. ముందు ముందు పరిస్థితి మరింత తీవ్రంగా వుంటుంది. చక్కగా.. చలికాలంలోనే నారా లోకేష్ ఇబ్బందులు వర్ణనాతీతం. అలాంటిది, వేసవి కాలంలో అయితే పరిస్థితి వర్ణనాతీతం అంతే.