బూతులు మాట్లాడితే నాయకుడివైపోతావా లోకేష్.?

మాస్ లీడర్ అంటే ఏంటో తెలుసా.? బూతులు మాట్లాడాలట.! అలాగని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. చెప్పడమేంటి తమ నాయకుడు నారా లోకేష్ బూతుల్లో ఆరి తేరిపోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. అడుగడుగునా పోలీస్ అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయన్నది నారా లోకేష్ ఉవాచ. ఆంక్షల పేరుతో యువగళం పాదయాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ లోకేష్ వాపోతున్నారు.

ఆ పోలీస్ అధికారులు సహకరించకపోతే, యువగళం పాదయాత్ర ఇంతలా సాగుతుందా.? ఛాన్సే లేదు. అయినా, లోకేష్ మాత్రం పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తూనే వున్నారు.

తాజాగా, లోకేష్ పోలీస్ అధికారుల్ని ఉద్దేశించి బూతులు మాట్లాడారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు చింపి పార.. దె.. తాం.. అంటూ బూతులు మాట్లాడేశారు నారా లోకేష్. దాంతో పోలీసులు అవాక్కయ్యారు. లోకేష్‌కి సర్ది చెప్పే ప్రయత్నం పోలీసులు చేసినా, ఆయన వారి మాటల్ని పట్టించుకోలేదు.

విదేశాల్లో చదువుకున్నానంటాడు, తాను పద్ధతిగల వ్యక్తినని సొంతంగా సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటాడు నారా లోకేష్. మరి, ఇదేం పద్ధతి.? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ శ్రేణులు పద్ధతిగా వుండాలని నారా లోకేష్ అనుకోవాలి. ముందు ఆయన పద్ధతిగా వుండాలి.!