పవన్ ని ఫాలో అవుతున్న లోకేష్… మిగతాదంతా సేం టు సేం!

చంద్రబాబుకు లోకేష్ సొంత పుత్రుడు అయితే.. పవన్ దత్తపుత్రుడు అని అంటుంటారు వైసీపీ నేతలు. పైగా… దాదాపు ఇద్దరికీ చంద్రబాబు ఒకటే స్క్రిప్ట్ ఇస్తారని చెబుతుంటారు. కాకపోతే మరీ రిస్క్ సబ్జెక్ట్లు పవన్ కు ఇస్తే.. జనరల్ ఇష్యూస్ కి సంబంధించిన స్క్రిప్ట్ చినబాబుకి ఇస్తారని అంటుంటారు. వాటికి బలం చేకూర్చేలా తాజాగా లోకేష్ స్పందించారు.

వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్.. జనసేన అనేది టీడీపీకి బీ టీం కాదని, ఆ విషయం కనీసం జనసైనికులైనా నమ్మాలని, వీరమహిళలైనా గ్రహించాలని చెప్పుకొచ్చారు. పైగా తనను తన కార్యకర్తలే ఎక్కువగా అనుమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీజేపీ – జనసేన – టీడీపీలు కలిసే పోటీ చేస్తాయని అని అంటున్నారు!

ఈ సమయంలో వారాహియాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు, సంభోదించిన విధానం, ఎత్తుకున్న అంశాలు, పిలిచిన పిలుపు… ఆల్ మోస్ట్ పవన్ కల్యాణ్ లాగానే నారా లోకేష్ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ స్టేట్ మెంట్లు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.

అవును… మార్కాపురం సభలో లోకేష్ అయితే జగన్ మీద తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. జగన్ తో పర్సనల్ అటాక్ అయితే చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ కూడా ఇలాంటి సవాల్ నే చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఏకవచనంతో పిలవడం మొదలుపెట్టారు.

నీవొక క్రిమినల్ వి జగన్ అన్నారు లోకేష్. ఇదే మాట వారాహి వాహనంపై పవన్ కూడా అనడం విశేషం. నీకూ నాకూ పోలికేంటి అని పవన్ అంటే.. ఇపుడు లోకేష్ అదే మాట అన్నారు. క్యారెక్టర్ అంటే తనదని, తనకు ఉందని జగన్ కి లేనిదీ అదే అంటూ రెట్టించి మాట్లాడారు.

ఇదే సమయంలో “నా గురించి చూడాలీ అంటే యూట్యూబ్ వెతకాలేమో.. నీ గురించి చెప్పాలంటే గూగుల్ టేకవుట్ చాలు, ఎవరు ఎవరికి కాల్ చేశారు, ఎంత టైం మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరూ ఎన్నిసార్లు కాల్స్ ఎందుకు మాట్లాడుకున్నారో తెలిస్తే నీకు గుండెపోటు వస్తుంది” అంటూ లోకేష్ కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది. అంతే కాదు “జగ్గూ బాయ్” అని పవన్ అంటే “ఫ్రస్ట్రేషన్ బాయ్” అని జగన్ని లోకేష్ అంటున్నారు.

దీంతో… పవన్ – లోకేష్… రూపాలు వేరు తప్ప (జగన్ ని విమర్శించే విషయంలో) మిగిలిందంతా సేం టూ సేం అంటూ కామెంట్లు చేస్తున్నారు వైసీపీ జనాలు!

కాగా… గూగుల్ టేకవుట్ పై ఇప్పటికే సీబీఐ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అవును… గూగుల్ టేక్ అవుట్ విషయంలో సీబీఐ తన తప్పును ఒప్పుకుంది. గూగుల్ టేక్ అవుట్ లో టైంను లెక్కించేటపుడు 5.30 గంటలను తాము తప్పుగా లెక్కించినట్లు అంగీకరించింది.

అంటే గూగుల్ టేక్ అవుట్ లో తెల్లవారిజాము 2.30 గంటలు చూపిందంటే అది గ్రీన్ విచ్ మీన్ (జీఎంటీ)గా చెప్పింది. ఆ టైంను భారత కాలమానం ప్రకారం (ఐఎంటీ) లెక్కించాలంటే దానికి 5.30 గంటలు కలపుకోవాలని చెప్పింది. అయితే గతంలో తాము అలా కలపలేదని ఒప్పుకుంది.

ఆ విషయంలో లోకేష్ కి అప్ డేట్ లేదో ఏమో మళ్లీ పాతచింతకాయ విమర్శలు చేసే ప్రయత్నం చేశారు అని అంటున్నారు పరిశీలకులు. అందులో భాగంగానే తనగురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ చూడాలేమో.. నీ గురించి తెలుసుకోవాలంటే గూగుల్ టేక్ అవుట్ చూడాలని కామెంట్లు చేశారు.

కాగా… వెంకటగిరి సభలో లోకేష్ పేరెత్తకుండా “పట్టపగలు మందు తాగుతూ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్స్ లో ఒకడు కనిపిస్తాడు, యూట్యూబ్ లో చూడండి” అని జగన్ అన్నారు.