నారా లోకేష్‌కి మతి గతి తప్పింది.!

ఔను, నారా లోకేష్‌కి మతి అనేది గతి తప్పినట్లుంది.! అసలే, పప్పేష్.. అనే విమర్శలు వైసీపీ నుంచి ఆయన మీదకు ప్రతిసారీ గట్టిగా దూసుకొస్తుంటాయ్. అలాంటప్పుడు, ఒకింత జాగ్రత్తగా వుండాలి కదా.? కానీ, పదే పదే తనకు తానే ట్రోల్ మెటీరియల్‌గా ఎందుకు లోకేష్ మారిపోతుంటారు.?

యువగళం పాదయాత్ర సందర్భంగా నిన్న జరిగిన ఓ బహిరంగ సభలో నారా లోకేష్ రెచ్చిపోయారు. రాజకీయాలన్నాక రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు సహజమే కావొచ్చు. కానీ, ‘మేమే అధికారంలోకి రాబోతున్నాం.. నడి రోడ్డు మీద కట్ డ్రాయర్‌‌తో నిన్ను తరిమికొట్టిస్తాం..’ అంటూ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడమేంటి.?

పైగా, గత కొంతకాలంగా నారా లోకేష్ ‘రెడ్ బుక్’ అంటూ అధికారుల్ని హెచ్చరించడం రోజురోజుకీ హాస్యాస్పదంగా మారుతోంది. కార్యకర్తల్ని అకారణంగా వేధిస్తున్న అధికారులకు అల్టిమేటం.. అంటున్నారాయన ఈ రెడ్ బుక్ చూపిస్తూ.

అసలు, టీడీపీ అధికారంలోకి రావాలనుకుంటున్నది దేనికి.? రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకా.? ఈ చర్చ జన బాహుళ్యంలో జరుగుతోంది. ‘రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాదు.. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికే టీడీపీకి అధికారం కావాలి..’ అంటూ జనం చర్చించుకుంటున్నారంటే, లోకేష్ తీరు ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

టీడీపీ అధికారంలో వున్నప్పుడు వైసీపీ నేతల్ని ఎలా వేధించారో ప్రపంచమంతా చూసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, టీడీపీ నేతలు అలాగే వేధింపులకు గురవుతున్నారు. మళ్ళీ రేప్పొద్దున్న టీడీపీ అధికారంలోకి వస్తే.. అంతకు మించిన కక్ష సాధింపు రాజకీయాలన్నమాట.

‘యువగళం’ కాదిది, నారా లోకేష్ చిమ్ముతోన్న గరళం.. అన్న సంకేతాలు జనంలోకి బలంగా వెళ్ళిపోతున్నాయ్.

#@AkBigNews కట్ డ్రాయర్ పై ఊరేగిస్తా : నారా లోకేశ్