లోకేష్ కి ఆ జాగ్రత్త ఏది… మారుతున్నారా?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని ప్రధాన పార్టీలూ ఎవరి ప్రచార కార్యక్రమాల్లో వారు బిజీగా ఉన్నారు. పైగా గెలుపు అనివార్యం అయిన ఈ ఎన్నికల్లో గెలవడం, ఫలితంగా నిలవడం టీడీపీ కి అతి ముఖ్యం. ఈసారి ఎన్నికల్లో టీడీపీ మరోసారి ఘోరంగా ఫెయిల్ అయితే మాత్రం… ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో… చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వైఎస్ జగన్ కొత్త స్లోగన్ వైనాట్ 175. ఈ స్లోగన్ టీడీపీ అధినేతలో కొత్త టెన్షన్ పుట్టించిందని చెబుతుంటారు. పైగా ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో కుప్పాన్ని కొట్టాలని జగన్ భారీ ప్లాన్స్ వేస్తున్నారు. ఆ బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దీంతో బాబు ఇప్పుడు పూర్తి శ్రద్ధ కుప్పం పై పెట్టారు. అవకాశం కుదురినప్పుడళ్లా కుప్పంలో వాలిపోతున్నారు.

ఇంతకాలం చేయని అభివృద్ధిని, ఇంతకాలం పట్టించుకోని కుప్పం ప్రజల పరిస్థితిని… మరోసారి గెలిపిస్తే చేసి చూపిస్తా అని చెప్పుకుంటున్నారు. ఇంతకాలం అలా నామినేషన్ వేసి ఇలా గెలిచే చంద్రబాబు… ఇప్పుడు కుప్పంలో కాళ్లు అరిగేళా తిరుగుతున్నారు. ఈసారి గెలుపు టీడీపీకి ఎంత ముఖ్యమో ఆ ఒక్క ఉదాహరణతోనే అర్ధమైపోతుంది.

ఇక ఈసారి పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వచ్చినా… పవన్ మాత్రం గోదావరి జిల్లాల్లోనే పోటీచేయబోతున్నారని కథనాలొస్తున్నాయి. పవన్ కాన్సంట్రేషన్ కూడా ఇక్కడే ఉందని తెలుస్తుంది. వారాహియాత్ర కూడా ఈ రెండు జిల్లాలోనే తిరుగుతుంది. ఫలితంగా.. గోదావరి జిల్లాలో సేఫ్ జోన్ కోసం పవన్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది.

పైగా… ఈసారి కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించాలని వైసీపీ బలంగా ఫిక్సవ్వడంతో పవన్ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అయితే ముద్రగడ ఎఫెక్ట్ తర్వాత ఈస్ట్ కంటే వెస్టే బెటరనే ఆలోచనలో కూడా ఉన్నారని అంటున్నారు. ఇలా పార్టీల అధినేతలు ఇద్దరూ ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటుంటే… లోకేష్ మాత్రం… ధైర్యంగా తిరుగుతున్నారు.

గత ఆరునెలలుగా పాదయాత్ర లో ఉన్న లోకేష్.. ఆల్ మోస్ట్ ఎన్నికలు సమీపించే సమయం వరకూ పాదయాత్రలోనే ఉండనున్నారు. మరి మంగళగిరిలో ఎప్పుడు ప్రచారం చేసుకుంటారనేది కీలకంగా మారింది. పైగా మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధపెట్టిన జగన్ సర్కార్… అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులు, ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాలు చకచకా చేసుకుపోతున్నారు. ఈసారి కూడా లోకేష్ ని ఓడించాలని.. అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదని భావిస్తుంది.

అయితే లోకేష్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. దీంతో… ఈసారి మంగళగిరిలో పోటీ చేయరేమో అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా హిందూపూర్ లాంటి సేఫ్ జోన్ ని చూసుకుని.. పోటీకి నిలబడితే బెటరని ఆలోచిస్తున్నారన్నట్లుగా కూడా కథనాలొస్తున్నాయి. అయితే తమ్ముళ్లు మాత్రం… ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెత్తుక్కోవాలి అని కొంతమంది… ఈసారి మంగళగిరిలోనే పోటీచేసి గెలిచి సత్తా చాటాలని మరికొంతమంది సూచిస్తున్నారంట.

మరి తమ్ముళ్లు కోరుకుంటున్నట్లు లోకేష్ ఈసారి కూడా మంగళగిరిలోనే పోటీచేస్తారా… లేక, తాను భావిస్తున్నారని చెబుతున్నట్లు మరో సేఫ్ జోన్ చూసుకుంటారా అన్నది వేచి చూడాలి.