స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు లోపల ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ములాకత్ లో కలిసిన నేతలు, కుటుంబ సభ్యులు. ఈ సమయంలో జైలు గదిలో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారంటూ వస్తున్న కామెంట్లపై పోసాని తనదైన శైలిలో స్పందించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని దోమలు కుడుతున్నాయని, ఆయన చన్నీళ్ల స్నానం చేస్తున్నారని, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని, ఏసీ లేకుండా ఎలా ఉంటారని ఆయన్ను ములాఖత్ లో కలసి వచ్చిన నాయకులు, కుటుంబ సభ్యులు బాధపడుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయాలపై వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. జైలులో ఉంటే ఖైదీలా ఉండాలి కానీ.. రాచమర్యాదలు ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ వ్యవహారంపై కాస్త సెటైరిక్ గా స్పందించారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
ఇందులో భాగంగా… చంద్రబాబుకు అవసరమైన దోమల మందు, దోమతెరలు తానే పంపిస్తానని అన్నారు. చంద్రబాబు కోసం తానే ఏసీ కొంటానని, ఎవరైనా జైలులోకి వెళ్లి ఆయనకు ఇచ్చిరావాలని అన్నారు. అనంతరం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి వ్యాఖ్యలపై స్పందించిన పోసాని ఆమెకు నాలుగు ప్రశ్నలు సంధించారు.
అందులో భాగంగా… “మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు? – మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు? – చంపిందెవరు? – వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు?” ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతాంటూ బ్రహ్మణికి తనదైన శైలిలో సవాల్ విసిరారు పోసాని.
ఇదే క్రమంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజల కోసమే అంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసిన పోసాని.. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నది కూడా ప్రజల కోసమేనా అంటూ చరుకలంటించారు. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమోనని ఎద్దేవా చేశారు.
తనపై వేసిన కేసుల నుంచి తప్పించుకోడానికి కోర్టుల నుంచి ఇప్పటి వరకు 17 స్టేలు తెచ్చుకుని రికార్డు సృష్టించారన్నారు చెప్పిన పోసాని.. అవినీతి పనులు చేస్తే జైల్లోనే పెడతారని అన్నారు. అనంతరం… ఏ దిక్కైనా వెళ్లండి బాగుపడతారు. దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి అని సూచించారు.
దివంగత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచావు.. ఒప్పుకోవు. ఎన్టీఆర్ ను చంపావు.. ఒప్పుకోవు. జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ప్రశాంతంగా ఏడాదో.. ఏడాదిన్నరో ఉండొచ్చు కదా? అక్కడ ఉండి కూడా ర్యాలీలు, ధర్నాల గురించి ఆలోచిస్తావెందుకు అంటూ చంద్రబాబుకి సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.