నందమూరి (బాలయ్యా)… సైడ్ ప్లీజ్!

స్వర్గీయ ఎన్టీఆర్ మొతుకున్నా.. లక్ష్మీపార్వతి రోధిస్తున్నా.. జూనియర్ దూరంగా ఉన్నా.. వారి ఆలోచనకు, ఆగ్రహానికి ఒక లెక్క ఉంది అని అంటుంటారు పరిశీలకులు. కారణం… నందమూరి వారు నారా వారి కాడి మొయ్యాలే తప్ప.. పల్లకి ఎక్కుతానంటే ఊరుకునేది లేదు. అదేంటి ఆ పల్లకు నందమూరి వారిదే కదా అని అంటారా.. అది నారా వారి నాలెడ్జ్.. నందమూరి వారి….?

ఈ క్రమంలో మరోసారి నారావారి రాజకీయం ముందు నందమూరి తలదించాల్సిన పరిస్థితి ఎదురైందని అంటున్నారు పరిశీలకులు. తమ నుంచి కబ్జా చేసిన లాక్కున్న తమ్మ ఇంటిలో తాము అరుగుపైన మాత్రమే ఉండాలి కానీ బెడ్ రూం లలోకి వస్తామంటే కుదరదు అని చెప్పకనే చెప్పారని అంటున్నారు విశ్లేషకులు. ఫలితంగా… పార్టీ ఏట్లో కలిసి పోయినా పర్లేదు కాన్నీ.. నందమూరి వారి చేతుల్లోకి మాత్రం వెల్లకూడదని చెబుతున్నారు మేధావులు.

వివరాళ్లోకి వెళ్తే… చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలకృష్ణ ఒక రోజు ముచ్చటపడి అధినేత కుర్చీలో కూర్చున్నారు. తనదైన శైలిలో ప్రసంగించారు. దీంతో జైల్లో చంద్రబాబు ఉలిక్కిపడ్డారని సమాచారం. దీంతో… టీడీపీ తన చేతుల్లోకి ఎలా వచ్చిందో.. తిరిగి నందమూరి వారి చేతుల్లోకి అలానే వెళ్లిపోతుందేమో అని కంగారు పడ్డారని చెబుతున్నారు. దీంతో… టీడీపీ వ్యూహకర్తలు బాలకృష్ణను దూరం పెడుతున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… బాలకృష్ణకు సంబంధించిన వార్తలేవీ చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే మీడియాలో హైలైట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. ఈ క్రమంలోనే బాబు అరెస్ట్ బాధతో చనిపోయారని చెబుతున్న కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పినా కూడా.. ఆ వార్తకు ప్రాధాన్యం లేనట్టే ఎల్లో మీడియా ప్రవర్తిస్తోంది. దీంతో బాబుకు బాలయ్య భయం పట్టుకుందా అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో… రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని.. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ పరామర్శించి బయటకొచ్చారు. అనంతరం కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే మాట్లాడారు. పవన్ మాట్లాడిన తర్వాత కనీసం బాలయ్యకు ఛాన్స్ ఇవ్వలేదు. పవన్ పొత్తు నిర్ణయాన్ని టీడీపీ తరపున స్వాగతిస్తున్నామనే మాటను బాలయ్యతో చెప్పించాలనుకోలేదు. దీంతో… జైలు పరామర్శ ఎపిసోడ్ లో బాలయ్యని జీరో చేసేశారు బాబు & కో!

ఇలా ఏ రకంగా చూసుకున్నా… చంద్రబాబు తర్వాత టీడీపీలో ఫోకస్ కావాల్సింది లోకేష్ కానీ బాలకృష్ణ కాదు అనేది ఆ పార్టీ పెద్దల వ్యూహంగా చెబుతున్నారు. ఈ సంధి సమయంలో బాలకృష్ణ పార్టీపై పెత్తనం తీసుకుంటే, మళ్లీ నందమూరి హవా పెరగడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో… అది ఇష్టంలేని నారా బ్యాచ్.. వ్యూహాత్మకంగా బాలయ్యను దూరం పెడుతోందని అంటున్నారు.

ఈ విషయాలు గ్రహించగలిగే జ్ఞానం బాలయ్యకు ఉందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… గ్రహించినా చేయగలిగేది ఏమీ లేదు… ఇది సినిమా కాదు అని అంటున్నారు నారావారి అభిమానులు. దీంతో… నందమూరి బాలయ్య సైడ్ ప్లీజ్!!