బాబును భలే కవర్ చేస్తున్న జాతి మీడియా

ఫలితాల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ చంద్రబాబునాయుడు మీడియా పడుతున్న అవస్తలు అన్నీ ఇన్నీ కావు.  ఆర్ధిక పరిస్ధితి అధ్వాన్నంగా ఉందని చెబుతూనే జగన్మోహన్ రెడ్డిని భయపెట్టటానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబే మళ్ళీ సిఎం అయితే ఆర్ధిక పరిస్ధితికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదట. జగన్ వస్తే మాత్రమే ఆర్దిక ఇబ్బందులు మొదలవుతాయనే విచిత్రమైన వాదనను జనాల్లో ప్రచారం చేస్తోంది.

చంద్రబాబు వస్తే ఆర్ధికంగా ఎందుకు ఇబ్బంది ఉండదంటే ఆల్రెడీ అమలవుతున్న పథకాలే కాబట్టి పెద్దగా ఇబ్బందులు రావట.  జగన్ సిఎం అయితే మాత్రం అదనంగా రూ 55 వేల కోట్ల భారం తప్పదట. అసలే ఆర్ధికంగా ఇబ్బందులున్న రాష్ట్రానికి అన్ని వేల కోట్ల భారం ఏరకంగాను సమంజసం కాదన్నట్లుగా కథనాలు వండి వారుస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ పోటీపడి జనాలకు ఎన్నో వరాలు గుప్పించారు. ఇద్దరిలో ఎవరు సిఎం అయినా పథకాలు అమలు చేయాల్సిందే. మొన్నటి ప్రచారంలో వైసిపి ఇచ్చిన హామీల్లో కొన్నింటిని చంద్రబాబు ఇప్పటికే అమల్లోకి తెచ్చారు కాబట్టి జగన్ సిఎం అయినా పెద్దగా పడే భారం ఉండదు.

అదే సమయంలో చంద్రబాబుకు ఇపుడు ఎవరు అప్పులు కూడా ఇవ్వటం లేదు. రేపు జగన్ సిఎం అయితే దుబారా ఖర్చులను తగ్గించటంతో పాటు ఆర్ధిక ఎమర్జెన్సీ విధించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా ఖర్చుల్లో కోత పెట్టేస్తారని అంటున్నారు. అంటే ఖర్చులను తగ్గించినా ఆదాయం వచ్చినట్లే కదా ? కాబట్టి ఆ పద్దతిలో తన హామీలకు నిధులను సమకూర్చుకుంటారేమో జగన్ . చూడాలి మరి ఏం జరుగుతుందో.