అలాగే ఉంది బిజెపి నేతల మాటలు. రాబోయే ఫలితాల్లో చంద్రబాబునాయుడుకు ఓటిమి తప్పదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు జోస్యం చెప్పారు. మురళీ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోతున్న చంద్రబాబుకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్పష్టంగా ప్రకటించారు.
ఎన్నికల తర్వాత టిడిపిని కలుపుకోవాలన్న కోరిక తమకేమీ లేదని కూడా ప్రకటించారు. ఇసుక మాఫియా వల్లే తెలుగుదేశంపార్టీకి బాగా చెడ్డ పేరొచ్చిందని తేల్చి చెప్పారు. చంద్రబాబుపై రాష్ట్రంలో తీవ్రంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ అనుకూలంగా మాలుచుకోవటంలో బిజెపి విఫలమైందని అంగీకరించారు.
చంద్రబాబు చేసిన తప్పులే వైసిపికి ప్లస్ పాయింట్లుగా మారినట్లు మురళీ విశ్లేషించారు. మోడి ప్రభావం లేని రాష్ట్రమేదైనా ఉంటే అది ఏపి మాత్రమే అని అంగీకరించారు. బిజెపికి 280 సీట్లు రావటం ఖాయంగా చెప్పారు. కాంగ్రెస్ కు 75 స్ధానాలకు మించి రావని జోస్యం కూడా చెప్పారు. మొత్తానికి ఏపిలో బిజెపి ప్రభావం ఏమీ లేదని అంగీకరించారు.