తప్పు చేసి దొరికిపోతే తప్పించుకునేందు ఎదురుదాడి చేయటం చంద్రబాబానాయుడుకు బాగా అలవాటైన విద్య. తాజాగా అదే విద్యను అమలు చేస్తున్నారు. 3.5 కోట్లమంది ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రైవేటు సాఫ్ట్ వేర్ కంపెనీలకు చంద్రబాబు కట్టబెట్టారు. ఆ వివరాలతో వైసిపి సానుభూతిపరులని అనుకున్న వారి ఓట్లను టడిపి పెద్ద ఎత్తున ఏరేస్తోంది. ఆ విషయంలో వైసిపి ఎప్పటి నుండో గోలచేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే వైసిపి ఓట్లను ఏరివేయటంలో టిడిపి అనుసరిస్తున్న పద్దతి బయటపడిందో వెంటనే చంద్రబాబు అప్రమత్తమయ్యారు.
వైసిపినే తమ ఓట్లను తొలగిస్తోందంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇప్పటికే టిడిపికి చెందిన 8 లక్షల ఓట్లను తొలగించాలని వైసిపి ప్రయత్నిస్తోందని చంద్రబాబు, మంత్రులు ఆరోపిస్తుండటమే విచిత్రంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వైసిపి అధికారపార్టీ అయిన టిడిపి ఓట్లను ఎలా తొలగించగలుగుతుంది ? ఓట్లను తొలగించటమన్నది అధికారంలో ఉన్న పార్టీకే చేతనవుతుందన్నది అందిరికీ తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అధికారపార్టీ చేప్పు చేతల్లో ఉంటుంది కాబట్టి ఓట్ల తొలగింపన్నది వారికే సాధ్యం.
తెలంగాణాలో ఓట్లను తొలగించటానికి టిఆర్ఎస్ అమలు చేసిన పద్దతిలోనే ఏపిలో కూడా వైసిపి ఓట్లను తొలగించేస్తోందని మంత్రులు చెప్పటంలో అర్ధమే లేదు. వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతోంది ఓట్ల తొలగింపన్నది అధికారపార్టీకే చేతనవుతుందని. అప్పట్లో ఓటుకునోటు కేసులో కూడా అడ్డదిడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు ఇదే పద్దతిలో అడ్డదిడ్డంగా మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటి నుండి కూడా ఈ కేసు విషయంలో చంద్రబాబు ఎదురుదాడి చేస్తునే కాలం నెట్టుకొస్తున్నారు. మరి డేటా చోరి స్కాంలో ఏమవుతుందో చూడాలి.