ఈసీపైకి ఎస్పీలను ఉసిగొల్పుతున్న చంద్రబాబు

చంద్రబాబునాయుడు అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారు. అన్నీ వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం మీదకు ఎస్పీలను ఉసిగొల్పుతున్నారు.  తమను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలంటూ ఇద్దరు ఎస్పీలు ఎన్నికల సంఘానికి ఘాటుగా లేఖ రాయటం సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాగాన్ని తమిష్ట ప్రకారం ఈసి బదిలీ చేయటం మామూలే.

బదిలీ అయిన వారెవరూ గతంలో తమ బదిలీని ప్రశ్నిస్తు ఈసికి లేఖ రాసినట్లు లేదు. తమ బదిలీకి కారణాలు చెప్పాల్సిందేనంటూ తాజాగా ఎస్పీలు ఈసికి లేఖరాయటమే ఆశ్చర్యంగా ఉంది. వైఎస్ సిఎంగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు అప్పటి డిజిపి ఎస్ఎస్ పి యాదవ్ పై ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే యాదవ్ ను ఎన్నికల విధుల నుండి తప్పించి మహంతికి బాధ్యతలు అప్పగించింది.

యాదవ్ ను తప్పించటంపై అప్పట్లో వైఎస్ గానీ లేకపోతే యాదవ్ కానీ ఈసి అధికారాలను ప్రశ్నించలేదు. అలాంటిది ఇపుడు చంద్రబాబు ఆపని చేస్తున్నారు. అంటే తనకిష్టం లేని పని ఎవరు చేసినా ? ఏ వ్యవస్ధ తనకు వ్యతిరేకంగా ఉంటుందనుకున్నా వెంటనే చంద్రబాబులోని అపరిచితుడు నిద్రలేస్తాడు. సదరు వ్యవస్ధను గబ్బు పట్టించేంత వరకూ చంద్రబాబు ఊరుకోడు. తన మీడియా ద్వారా బురద చల్లిస్తాడు. ఇపుడు జరుగుతున్నది కూడా అదే.

ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి,  పోలీసు బాస్ డిజిపి కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చేస్తారన్నపుడు డిజిపికన్నా తక్కువస్ధాయి అధికారైన ఐబి చీఫ్ మాత్రం ఎన్నికల పరిధిలోకి రాకుండా ఎలా ఉంటారు ? అంటే ఐబి చీఫ్ లేకపోతే చంద్రబాబుకు కాళ్ళు చేతులు ఆడవు. ఎందుకంటే, ఐబి చీఫ్ చంద్రబాబుతో అంతలా అంటకాగుతున్నారు. అందుకే వెంకటేశ్వరరావు బదిలీని తట్టుకోలేక అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సరే విషయం ఎలాగూ కోర్టుకెక్కింది కాబట్టి న్యాయస్ధానం ఏం చేస్తుందో చూడాల్సిందే.