కోరిక తీర్చుకున్న చంద్రబాబు

మొత్తానికి చంద్రబాబునాయుడు పంతం నెగ్గించుకున్నట్లే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం పెడతానంటూ పంతానికి పోయారు. ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా షరతులతో కూడిన క్యాబినెట్ సమావేశానికి ఎన్నికల కమీషన్ అనుమతించింది. దాంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి దాదాపు 5 గంటల వరకు క్యాబినెట్ సమావేశం జరిపించామనిపించుకున్నారు చంద్రబాబు.

విధానపరమైన నిర్ణయాలు కానీ ఎటువంటి ఆర్దికపరమైన అంశాలపైన కానీ చర్చించేందుకు లేదనే ఎన్నికల కమీషన్ ఆదేశాలకు అనుగుణంగానే చంద్రబాబు క్యాబినెట్ నిర్వహించారు. సమావేశంలో కరువు, మంచినీటి ఎద్దడి, ఫణితుపాను, ఉపాధిహామీపథకం అంశాలపై మాత్రమే చర్చించి క్యాబినెట్ ముగించారు. నికి ఇప్పటికప్పుడు క్యాబినెట్ సమావేశమై చర్చించాల్సినంత అర్జెంట్ విషయాలేమీ లేవు.

అయినా క్యాబినెట్ సమావేశం జరపాలన్న పంతానికి పోయారు చంద్రబాబు. చంద్రబాబుతో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం భేటీ అయిన తర్వాతే ఎన్నికల సంఘం క్యాబినెట్ సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం గమనార్హం. మొత్తానికి ఫలితాల్లోగా చివరి క్యాబినెట్ సమావేశం నిర్వహిచి చంద్రబాబు తన తృప్తి తీర్చుకున్నారు.