Pawan Kalyan: కేబినెట్ మీటింగ్ కు డుమ్మా కొట్టిన పవన్… ప్రజలకంటే సినిమాలే ముఖ్యమా?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈయన పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉన్నారు తప్ప ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే వాదన కూడా వినపడుతుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించి ఎన్నో కీలక మీటింగ్లకు హాజరవుతున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇకపోతే కలెక్టర్ల సమావేశం నిర్వహించిన, కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ దరిదాపుల్లో కనిపించడం లేదు. ఇక కేబినెట్ మీటింగ్ అయితే ఏదో ఒక కారణం చెప్పి పవన్ కళ్యాణ్ డుమ్మా కొడుతున్నారు.

గత రెండు మూడు క్యాబినెట్ మీటింగ్లకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవటం గమనార్హం. తన తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురైనట్టు సమాచారం రావడంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన క్యాబినెట్ మీటింగ్ వదులుకొని హైదరాబాద్ వెళ్లారు అంటూ వార్తలు వచ్చాయి.. అయితే అంజనాదేవి ఆరోగ్యం బాగుందని ఇదంతా తప్పుడు సమాచారం అంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ వదులుకొని హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చిందనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ప్రజల సమస్యలకు, ప్రజాపాలన కంటే కూడా సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. దాదాపు నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ కూడ పక్కన పెట్టి సినిమా షూటింగ్ కి వెళ్ళారని తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఈయన అనారోగ్యానికి గురయ్యారంటూ మీటింగ్ కు వెళ్లకపోవడం సినిమా షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. తాజాగా మరోసారి కూడా కేబినెట్ మీటింగ్ కు పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటంతో ఈయనకు ప్రజా సమస్యల కంటే సినిమాలే ప్రధానమైనప్పుడు సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా అని తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.