ఏపీలో అన్ని ప్రధాన పార్టీలూ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. ఏపీరాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు ఖాయమని చెప్పుకుంటున్న వేళ కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. ఒకవైపు రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు ఖాయమని టీడీపీ నేతలే చెబుతుండగా… మరోపక్క జనసేనలో చేరాల్సిన ఇతర పార్టీల నేతలు టీడీపీలో దర్శనమిస్తున్నారు! ఇదే క్రమంలో “జనసేనలో నెంబర్ 2 గా ఉన్న నాదెండ్ల మనోహర్ కు టీడీపీ ఆఫర్ ఇచ్చింది.. అందుకు ఆయన సై అన్నారు” అనే వార్తలు ఆన్ లైన్ లో తెగ హల్ చేస్తున్నాయి.
అవును… తనదైన రాజకీయాన్ని, తనకున్న అనుభవాన్ని ఉపయోగిస్తున్న చంద్రబాబు… రాబోయే ఎన్నికలు తన పొలిటికల్ కేరీర్ లో చివరివని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే! కాబట్టి ఈసారి గెలవడానికి చంద్రబాబు ఎన్ని ఎత్తులైనా వేస్తారు – మరెన్ని పొత్తులైనా చేస్తారు! అందులో భాగంగానే.. జనసేన నేత నాదేండ్ల మనోహర్ వైపు చంద్రబాబు చూపు పడిందంట. అంతే… అనుకున్నదే తడవుగా నాదెండ్లతో మంతనాలు చేసిన టీడీపీ సీనియర్లు.. చర్చలు కూడా పూర్తిచేశారని.. ఇక బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. మాంచి ముహూర్తం చూసి గ్లాసు కిందపెట్టేసి, సైకిల్ పైకి ఎక్కేస్తారని ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.
దీంతో ఉలిక్కిపడిన జనసైనికులు… పార్టీలో పవన్ తర్వాత నాగబాబుని సైతం కాదని, నాందేండ్లకు అంత విలువ ఇస్తుంటే… పార్టీకి సంబందించిన ఆల్ మోస్ట్ అన్ని కార్యక్రమాలూ నాదేండ్ల కనుసన్నల్లోనే జరుగుతుంటుంటే.. మనోహర్.. జనసేనను వీడతారా? పవన్ కు వెన్నుపోటు పొడుస్తారా? అని ఫీలవుతున్నారంట! అయితే జనసైనికుల ఆవేదనపై “రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు”.. అంటున్న విశ్లేషకులు.. తాజాగా జరిగిన రెండు మూడు ఉదాహరణలను వారికి చూపిస్తున్నారట.
పవన్ సామాజికవర్గానికే చెందిన కన్నా లక్ష్మీనారాయణ త్వరలో జనసేనలో చేరిపోబోతున్నారని – కాపులకు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న పవన్ కు అండగా ఉండబోతున్నారని.. జనసేనలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారం జరుగుతుండగానే… కన్నా లక్ష్మీనారాయణ పసుపు కండువా కప్పుకుని సైకిల్ ఎక్కేశారు. ఇదే క్రమంలో… పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున వంగవీటి రాధా, తన అనుచరులతో, పవన్ సమక్షంలో జనసేనలో చేరిపోతున్నారని కథనాలొచ్చాయి. కట్ చేస్తే… లోకేష్ పాదయాత్రలో రాధా దర్శనం ఇచ్చారు.. కలిసి నడిచారు!
కాబట్టి… ఈసారి గెలవకపోతే దుకాణం సర్దేసుకోవడమే అని ఫీలవుతున్న చంద్రబాబు… గెలుపు కోసం ఈసారి ఏమైన చేస్తారని, ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారని, కాబట్టి నాదేండ్లపై వస్తున్న ఊహాగాణాలు నీజమయ్యే సూచనలు ఉన్నాయని.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని క్లారిటీ ఇస్తున్నారు విశ్లేషకులు!
ఈ క్లారిటీ ఇలా ఉంటే… ఈ ఏపీసోడ్ పై మరో భిన్న వాదన వినిపిస్తుంది. ఇప్పటికే పవన్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారని పచ్చకుట్రలో భాగంగా ప్రచారానికి తెరతీసిన టీడీపీ అను”కుల” మీడియా… కావాలనే ఇలాంటి గాసిప్స్ ని క్రియేట్ చేస్తుందని.. ఫలితంగా కేడర్ లో కన్ ఫ్యూజన్ ని, పార్టీలో ఉన్న నేతల్లో ఆందోళనని, చేరబోతున్న నేతల్లో పునరాలోచననీ క్రియేట్ చేసే ప్రయత్నం అయ్యి ఉండొచ్చని అంటున్నారు.
మరి ఈ ఊహాగాణాలపై నాదేండ్ల మనోహర్ జనసైనికులకు వివరణ ఇస్తారా.. లేక, ఏకంగా బాబు సమక్షంలో పసుపు కండువాకప్పుకున్న అనంతరం ప్రెస్ మీట్ పెట్టి సర్ ప్రైజ్ ఇస్తారా అన్నది వేచి చూడాలి!