నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి మృతిచెందారు. నంద్యాలకు మూడుసార్లు ఎంపిగా చేసిన రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ తరపున గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున నెగ్గారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేశారు. 2014లో ఎంపిగా గెలిచిన రెడ్డి వారం రోజులకే తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించి ఫిరాయింపులకు తెరలేపారు.
మొన్నటి ఎన్నికల్లో టిడిపి టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా చంద్రబాబునాయుడు ఇవ్వలేదు. దాంతో జనసేన తరపున ఫ్యామిలీ ప్యాక్ తీసుకుని పోటీ చేశారు. నంద్యాలకు రెడ్డి ఎంపిగా పోటీ చేయగా అల్లుడు నంద్యాల ఎంఎల్ఏగాను ఇద్దరు కూతుళ్ళు శ్రీశైలం, మంత్రాలయం నియోజకవర్గాల్లో పోటీ చేశారు.
రెడ్డి రాజకీయ నేతగానే కాకుండా నందిపైపుల వ్యవస్ధాకునిగా బాగా పాపులర్. అంతేకాకుండా పేదల ఆకలి తీర్చేందుకు చాలాకాలం ఒక్క రూపాయికే జొన్న రొట్టెను అందించిన విషయం అందరికీ తెలిసిందే. చాలాకాలం గుండె, కిడ్న సంబంధింత సమస్యలతో ఇబ్బంది పెడుతున్నారు. చాలాకాలం ఆసుపత్రిలోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో అనారోగ్యంతోనే ప్రచారం చేశారు. ఏదేమైనా కర్నూలు జిల్లాలోనే సీనియర్ అయిన ఎస్పీవై రెడ్డి మరణం తీరని లోటనే చెప్పాలి.