నారా లోకేష్ కి ఊహించని షాక్ తగలనుందా??

నారా లోకేష్ కి బిగ్ షాక్ తగలనుందా? ఇప్పటికే బాబ్లీ కేసు వ్యవహారంలో సీఎం అయినప్పటికీ కోర్టుకు హాజరు కావాల్సిందే అని ధర్మాబాద్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీఎం తరపు న్యాయవాదులు వేసిన రీకాల్ పిటిషన్ ని తిప్పి కొట్టింది న్యాయస్థానం. వచ్చే నెల 15 న వాయిదాకు హాజరు కావాల్సిందేనని తెలిపింది ధర్మాబాద్ కోర్టు. దీంతో టిడిపి కి షాక్ తగిలినట్టైంది. అయితే బాబ్లీ కేసు మళ్ళీ బయటకు తీసుకురావడం బీజేపీ కుట్రగా టిడిపి వర్గాలు ఆరోపించాయి. అప్పటి నుండి కసితో ఉన్న బీజేపీ శ్రేణులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం తనయుడు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ పై కూడా కోర్టులో కేసు వేయనున్నట్టు తెలుస్తోంది.

అవకాశం దొరికినప్పుడల్లా టిడిపి పై విమర్శల దాడి చేస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఏ చిన్న ఛాన్స్ దొరికిన టిడిపి ని ఇరికించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే చిన్నబాబు నారా లోకేష్ కి గట్టి షాక్ ఇవ్వడానికి పావులు కదుపుతున్నారు. టిడిపిని విమర్శించడానికి ముందుండే బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు మరోసారి టిడిపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐటీ కంపెనీల పేరుతో ఆంధ్రాలో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందన్నారు. ప్రోత్సాహాల ముసుగులో షెల్ కంపెనీలు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం కుమారుడు లోకేష్ మంత్రిగా ఉన్న ఐటీ శాఖలో కొత్తగా వచ్చిన కంపెనీలేవి లేవని ఆయన ఆరోపించారు. ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల డబ్బు దోపిడీ చేశారని పేర్కొన్నారు. వేల కోట్లు చేతులు మారడానికి 2014 నుండి విడుదల అయిన జీవోలు నిదర్శనం అని వెల్లడించారు. ఐటి శాఖలో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్ళబోతున్నట్టు తెలియజేశారు. ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయో వాటికి సంబంధించిన వివరాలు వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ సర్కార్ ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వమంటే ఇవ్వట్లేదంటూ మండి పడ్డారు. ప్రజల వద్దకు చేరాల్సిన సమాచారం కూడా తెలుపట్లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ప్రోత్సాహకాలు ఇవ్వాలని 2014 నుండి 2020 వరకు జీవోలు రిలీజ్ చేశారని అన్నారు. అనేక సంస్థలు తెచ్చామని, ఉద్యోగాలు కల్పించకుండానే కోట్ల దండుకున్నారని విమర్శించారు. భూములు నామమాత్రపు ధరకు ఇచ్చి, మూడేళ్ళ తర్వాత కమర్షియల్ ధరకు అమ్ముకోవచ్చని కూడా చెప్పారని వివరించారు. ఐటీ శాఖలో లోకేష్ ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవోల పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. తాము కోరిన సమాచారాన్ని వెంటనే ప్రభుత్వం తెలపాలంటూ డిమాండ్ చేశారు జివిఎల్. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

ఇదీ  చదవండి

 

పెట్రోల్ ధర 100 దాటటంతో పెట్రోల్ బంకును ఏం చేశారో చూడండి (వీడియో)