వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, హిందూపురం ఎంపీ (లోక్ సభ) గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతున్న ఓ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. ‘గోరంట్ల లీక్స్’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున చర్చ జరుగుతోంది ఈ అంశంపై. దేశవ్యాప్తంగా ఈ వీడియో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది కూడా.
ఇదిలా వుంటే, ఈ వీడియోలో ఓ మహిళ కనిపిస్తోంది. ఆ మహిళ వైసీపీకి చెందిన అనితా రెడ్డి.. అంటూ కొందరు నెటిజనం (టీడీపీ, జనసేన మద్దతుదారులు) ఆరోపిస్తున్నారు. అందులో ఫొటో కూడా అలాగే కనిపిస్తోంది. అయితే, ఈ రోజుల్లో ఇలాంటి మార్ఫింగ్ వ్యవహారాలు కొత్తేమీ కాదు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ విషయంలో ‘నిజమేనేమో..’ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, అనితారెడ్డి ఫొటో వ్యవహారం మాత్రం మార్ఫింగ్‌లానే కనిపిస్తోంది.
సరే, ఆ మొత్తం వీడియో వ్యవహారంలో నిజానిజాల్ని తేల్చాల్సింది పోలీసులు. తమ ఎంపీ మీద ఇంతటి తీవ్రమైన, జుగుప్సాకరమైన ఆరోపణలు రావడంతో అధికార వైసీపీ ఈపాటికే తగిన చర్యలు తీసుకుని వుండాల్సింది. కానీ, తీసుకోకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. పైగా, వీడియోలో వున్న మహిళగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనితా రెడ్డి తాజాగా పోలీసుల్ని ఆశ్రయించారు.
పలువురి పేర్లను పేర్కొంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, ఈ విషయం కొత్త మలుపు తిరిగినట్లయ్యింది. ఓ మహిళ తనను కించపర్చుస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన దరిమిలా, పోలీసులు వేగంగా స్పందించే అవకాశమైతే లేకపోలేదు. కొన్ని అరెస్టులూ జరగొచ్చు కూడా.
అదే జరిగితే, వైసీపీ కార్యకర్త ఫిర్యాదు చేస్తే అరెస్టులు చేస్తారా.? వైసీపీ ఎంపీ నగ్నంగా బరితెగిస్తే పట్టించుకోరా.? అన్న ప్రశ్న కూడా తెరపైకొచ్చే అవకాశం లేకపోలేదు.