స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ నేతలు చేస్తున్న పనులు, ఎంచుకుంటున్న వ్యూహాలు పూర్తి స్థాయిలో బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లిపోయిన తర్వాత.. ఆ దిశగా ప్రయత్నాలు మరింత పదునుపెట్టాలి తప్ప… నిరసనల వల్ల వణగూరే ప్రయోజనాలు శూన్యం అని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ నేతలు మరో కార్యక్రమం తలపెట్టారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా అక్కడక్కడా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే… టీడీపీ శ్రేణుల నుంచి, సాధారణ ప్రజానికం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని పలువురు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ పిటిషన్ సమయంలో జన సమీకరణపై అచ్చెన్నాయుడు రిక్వస్ట్ కు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది.
ఈ సమయంలో ఈ నేపథ్యంలో టీడీపీ సెప్టెంబర్ 30న మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా సీఎం జగన్ కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ఆన్ లైన్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇందులో భాగంగా… ఐదు కోట్ల ఆంధ్రులంతా ఒక్కటిగా ఇంట్లోనో, ఆఫీస్ లోనో ఇంకెక్కడ ఉన్నా సరే బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని కోరుతున్నారు నారా కుటుంబ సభ్యులు. ఇదంతా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నని చెబుతున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీం లో ఉంది, బెయిల్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో ఐదు నిమిషాల వ్యవధిలో గిన్నెలు, గంటలూ పట్టుకుని వాయించాలని చెబుతున్నారు. రోడ్డుపై వాహనంతో ఉంటే హారన్ మోగించాలట. ఆఫీసులు ముంగించుకుని ఇంటికి వస్తున్న జనం ఆ సమయంలో బైక్ పైనో, కారులోనో వస్తున్నప్పుడు హారన్ మోగించడం అత్యంత సహజం. దాన్ని కూడా నిరసనలో కలిపే ఆలోచన చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఆలోచనా విధానం మారనంత కాలం టీడీపీ పరిస్థితి ఇలానే ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ గురించి కోర్టుల్లో చేసే వాదనలు కోర్టుల్లో చేస్తూ… ప్రజలకు తమ వెర్షన్ చెప్పడానికి అనువైన అసెంబ్లీ సమావేశాల్లో వారి వెర్షన్ వినిపించాల్సింది పోయి.. ఇలా గంటలు, గిన్నెలూ, హారన్ లూ మోగించాలని కొరడం పలువురు పెదవి విరుస్తున్నారు. సో… శనివారం ఈవినింగ్ 7 – 7:05 మధ్య ఎవరైనా హారన్ మోగిస్తే… అది బాబు ఖాతాలోకి వెళ్తుందన్నమాట!!