మార్గదర్శిలో మనీల్యాండరింగ్… కన్ ఫాం చేసిన శైలజ?

ఎన్నికల ప్రచారంలో హామీలు ఇవ్వడం, అనంతరం ఇచ్చినవి ఇచ్చినట్లు నెరవేర్చడంతో జగన్ విషయంలో… “చెప్పాడంటే.. చేస్తాడంతే..” అని చెబుతుంటారు వైసీపీ నేతలూ, కార్యకర్తలు. ఇదే క్రమంలో మిగిలిన కొన్ని విషయాల్లో… “అనుకున్నాడంటే… అంతుచూస్తాడంతే..” అని ఆన్ లైన్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు! ఇందులో భాగంగా మార్గదర్శి కేసును తెరపైకి తేవడంతో పాటు… తాజాగా రామోజీ ఇంటిముందు జరిగిన సంఘటనను ప్రస్థావిస్తున్నారు.

“తగ్గేదేలే” అనేది జగన్ నినాదంలా అనిపిస్తున్న రోజులు ప్రస్తుతం ఏపీలో నెలకొన్నాయి! “మంచికి మంచి.. పంచ్ కి పంచ్” అన్నట్లుగా జగన్ పాలన సాగుతుందనే కామెంట్లూ వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో రామోజీ రావు అంతటివారు సైతం మంచంపై పడుకుని “ఇది కాలమహిమో.. జగన్ మహిమో” అన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా ఇంటికొచ్చిన సీఐడీ అధికారుల విషయంలో రామోజీ టీం అతిగా ప్రవర్తించింది. దీంతో… రామోజీపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మార్గదర్శి చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ2, ఎండీ శైలజ కిరణ్ ని సీఐడీ అధికారులు విచారించడానికి వెళ్లారు. ఆ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది మార్గదర్శి ఉద్యోగులు… విచారణకు వచ్చిన అధికారులందరినీ తమ ఎండీ ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే… వారిలో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు కూడా ఉండటమేనట.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే… మార్గదర్శి చీటింగ్‌ లో మనీల్యాండరింగ్ కోణం ఉంద‌ని సీఐడీ అనుమానిస్తోంది. డీఆర్ఐ అనేది బ్లాక్ మనీ, మనీల్యాండరింగ్‌ తో పాటు ఇతర ఆర్థిక‌ నేరాలను దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగా సీఐడీ అధికారులు డీఆర్ఐ అధికారులను కూడా తీసుకెళ్లారు. ఈ విషయం తెలియని కొంతమంది అర్ధజ్ఞానులు వీరిని అడ్డుకుని హడావిడి చేశారు! అయితే… ఒకసారి కమిట్ అయ్యాక తమ మాట తామే వినము అన్నట్లుగా భీష్మించుకున్న జగన్ ప్రభుత్వంలోని సీఐడీ అధికారులు… డీఆర్ఐ అధికారులతో కలిసి లోపలకు వెళ్లారు.

దీంతో ఏ1 రామోజీ, ఏ2 శైలజ లపై ఆన్ లైన్ వేదికగా కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. “ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే తమను ఎవరు విచారించాలో డిసైడ్ చేస్తారా”? ఇక్కడ ఉన్నది జగన్ సర్కార్..! అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇలా “డీఆర్ఐ అధికారులను అడ్డుకోవడం వల్ల మనీల్యాండరింగ్ అనుమానాలు మరింత బలపడ్డట్లు అయ్యిందని” మరికొందరు కామెంట్ చేస్తున్నారు! ఫలితంగా మార్గదర్శి అక్రమాల్లో మనీ ల్యాండరింగ్ కూడా ఉందనే విషయం పరోక్షంగా కన్ ఫాం చేసినట్లు అయ్యిందని ఇంకొంతమంది స్పందిస్తున్నారు!