గాంధిపైనే మనీల్యాండరింగ్ కేసు

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదైంది. ఆయన ఆస్తులను కూడా ఈడి అటాచ్ మెంట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబునాయుడు కోసమని  కేసులతో విరుకుపడిన శ్రీనివాస గాంధి చివరకు అదే డిపార్ట్ మెంట్ చేతిలో బుక్కయ్యారు.

చంద్రబాబు మెప్పుకోసమని జగన్ తో పాటు ఆయన భార్య భారతిపైన కూడా గాంధి అనేక కేసులు పెట్టారు. అవసరం లేకపోయినా, కేసులతో సంబంధాలు లేకపోయినా జగన్ అండ్ కో ను ఈడి విచారణకు పిలిపించటం, ఆస్తులు జప్తు చేయటం లాంటి చర్యలతో గాంధి చాలా ఓవర్ చేశారు.

అందుకనే గాంధి తో పాటు మరో ఇద్దరు అధికారులపై అప్పట్లోనే వైసిపి ఏకంగా ప్రధానమంత్రికే ఫిర్యాదు చేసింది. 2010 నుండి మొన్నటి వరకూ ఈడిలోనే పనిచేసిన గాంధిని జిఎస్టి సూపరెండెంట్ గా బదిలీ చేసిన ఈడి  ఆయన కదలికలపై నిఘా పెట్టింది. అక్రమాస్తుల విషయంలో పూర్తిగా సమాచారం అందగానే హఠాత్తుగా ఆయన ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేసి పట్టుకుంది.

ఈడి జప్తు చేసిన గాంధి ఆస్తుల విలువ మార్కెట్ వాల్యు ప్రకారం సుమారు రూ. 200 కోట్లుంటుందని అంచనా వేసింది. ఈ మొత్తం ఆస్తులను జప్తు చేసి ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేస్తోంది.  అందిన సమాచారం ప్రకారం ఎవరిపైనైనా దాడులు చేయటం వేరు. కానీ ఎవరి కోసమే అదే పనిగా దాడులు చేసి ఇబ్బందులు పెట్టటం వేరు. అందుకే గతంలో ఆయన చేసిన పనికి ఇపుడు ఆయనే బలైపోయారు.